తూర్పుగోదావరి

‘దేశం’-బిజెపి మధ్య ఇళ్ల రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిత్రపక్షాల మధ్య పెరుగుతున్న అగాధం: జనంలో అయోమయం

రాజమండ్రి, డిసెంబర్ 18: తెలుగుదేశం, బిజెపి పార్టీల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు ఉన్నతస్థాయిలో సమన్వయ సమావేశాలు జరుగుతున్నా జిల్లాలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య అగాధం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ వివాదానికి రాజమండ్రిలో గృహ నిర్మాణాల అంశం కేంద్ర బిందువయింది. అందరికీ ఇళ్లు నినాదంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాజమండ్రిలో బలహీనవర్గాలకు, మధ్యతరగతి వర్గాలకు ఇళ్లు నిర్మించాలని రాజమండ్రి సిటి ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ చేపట్టిన ప్రయత్నం రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. కేంద్రప్రభుత్వం కల్పించే రాయితీతో కొన్ని కేటగిరీల్లోను, కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల భాగస్వామ్యంతో మరికొన్ని కేటగిరీల్లోను ఎన్ని ఇళ్లు కావాలన్నా నిర్మిస్తామని ఎమ్మెల్యే చెబుతున్నారు. దాంతో రాజమండ్రి నగరంలోని అన్ని వర్గాల ప్రజలు ఇళ్ల కోసం దరఖాస్తులతో రాజమండ్రి సబ్‌కలెక్టర్ కార్యాలయంతో పాటు, ఎమ్మెల్యే కార్యాలయానికి క్యూ కడుతున్నారు.
అయితే అదే సమయంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం ఇలాంటి ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు. రాజమండ్రిలో అంత మందికి ఇళ్లు నిర్మించేందుకు స్థలం లేదని, అనవసర ప్రచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దని విలేఖర్ల సమావేశంలో నిర్మొహమాటంగానే చెప్పారు. దీనిపై నగర బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేయటం, దానికి ప్రతిగా తెలుగుదేశం నాయకులు ఘాటుగా స్పందించటం తదితర పరిణామాలు ఒకదాని వెనుక మరొకటి నగరంలో వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఇది రెండు పార్టీల మధ్య వివాదంగా రూపాంతరం చెందుతోంది. ఈనేపథ్యంలో అసలు ఎవరి మాట నమ్మాలో తెలియక దరఖాస్తుదారులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.