రాష్ట్రీయం

బొగ్గు కొనుగోలులో రూ.1200 కోట్లు అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి
మడకశిర, డిసెంబర్ 31: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తి కోసం చేసిన బొగ్గు కొనుగోళ్ళలో దాదాపు రూ.1200 కోట్లు దుర్వినియోగం అయినట్లు పిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. గురువారం అనంతపురం జిల్లా మడకశిరలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.1200 కోట్లు అధికంగా చెల్లించి బొగ్గు కొనుగోలు చేశారన్నారు. బొగ్గు కొనుగోలు వ్యవహారంలో ప్రైవేటు సంస్థలకు లాభం చేకూర్చి, ముఖ్యమంత్రి, అతని అనుచరులు స్వాహా చేశారని ధ్వజమెత్తారు. దీని వల్ల ప్రజలకు ఏమాత్రం లాభం లేదన్నారు. దేశంలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు. అధికారం చేపట్టిన తర్వాత వ్యవసాయ రంగానికి కనీసం ఆరు గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులు, విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పిన తెలుగుదేశం పార్టీ తీరా అధికారం చేపట్టాక ప్రజలపై రూ.1000 కోట్ల భారం మోపిందన్నారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం రైల్వే చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. ప్రస్తుతం పెంచిన చార్జీల వల్ల సామాన్యులు ప్రయాణం చేయడానికి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 2వ తేదీ నుండి నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు. 18 నెలల కాలంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు ఇసుక, బొగ్గు, విద్యుత్ కొనుగోలు, పింఛన్ల ద్వారా దోచుకున్న దాని గురించి ప్రజలకు వివరించాలన్నారు.