జాతీయ వార్తలు

మోదీ ఎవరికి కాపలాదారుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికి కాపలాదారుడు అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆయన కలబురిగిలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోదీ రైతుల రుణాలు మాపీ చేయకుండా ఉన్నతవర్గానికి చెందిన 15 మంది 3.5 లక్షల కోట్ల రుణాలు రద్దు చేశారని, తాము అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేస్తామని, ఇటీవల అధికారంలోకి వచ్చిన మూడు రాష్ట్రాల్లో రైతుల రుణాలు మాఫీ చేశామని తెలిపారు. నిజమైన జీఎస్టీని అమలుచేస్తామని తెలిపారు. పెద్దనోట్ల రద్దుతో పేదలను, రైతులను మోదీ లైన్లో నిలబెట్టారని అన్నారు. రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీకి ఈ దేశ ప్రధాని కాపలదారుడిగా ఉన్నారని విమర్శించారు.