జాతీయ వార్తలు

అధికారంలోకి వస్తే రఫేల్‌పై విచారణ:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తాము అధికారంలోకి వస్తే రఫేల్ ఒప్పందంలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయంలో మోదీ ఖచ్చితంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ వాగ్ధానం చేసిన కనీస ఆదాయ పథకం ‘న్యాయ్’ అమలు కోసం ప్రజలపై పన్నుభారం వేయబోమని తెలిపారు. గాడి తప్పిన ఆర్థికవ్యవస్థను పునరుద్ధరిస్తుందని అన్నారు. పేదల చేతికి డబ్బు వస్తుంది. కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా ఉత్పాదక రంగం ఊపందుకుంటుందని అన్నారు. ప్రియాంక, జోతిరాధిత్య సింధియా రాకతో యూపీలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని అన్నారు.