జాతీయ వార్తలు

రాహుల్ ఇంటి ఎదుట నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానానికి రాజీనామా చేసే విషయంలో రాహుల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకునే విషయంలో రాహుల్ వెనక్కి తగ్గటంలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో యువజన కాంగ్రెస్ నేతలు ఆందోళన బాట పట్టారు. యువజన కాంగ్రెస్ నేత అశోక్ చాంద్నా మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అధ్యక్షుడిగా రాహుల్ నిబద్ధతతో పనిచేశారని అన్నారు. రాహుల్ పార్టీని నడిపించాలని నినాదాలు చేశారు.