జాతీయ వార్తలు

రాహుల్‌ గాంధీకి అసోం కోర్టు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం దావా కేసులో సెప్టెంబరులో కోర్టు ముందు హాజరుకావాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కామ్‌రూప్‌లోని కోర్టు ఆదేశించింది. 2015 డిసెంబరులో రాహుల్‌ గాంధీ అసోంలోని బార్‌పేట సత్ర(బౌద్ధ ఆలయం) నుంచి మసీదు వరకు ర్యాలీ చేశారు. తనను బార్‌పేట సత్రలోకి వెళ్లకుండా ఆరెస్సెస్‌ అడ్డుకుందని మరుసటి రోజు పార్లమెంటులో ఆరోపించారు. ఈ విషయంపై రాహుల్‌పై దాఖలు చేసిన పరవు నష్టం దావా కేసులో నేడు విచారణ జరిగింది. మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్‌కు సంబంధం ఉందని వ్యాఖ్యానించినందుకు రాహుల్‌పై మరో పరువు నష్టం దావా సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే.