జాతీయ వార్తలు

మోదీ విధానాలు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ: ప్రధాని మోదీ విధానాలు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయని, ప్రజలు, విపక్షాల మాట వినని మోదీ, అమిత్ షా ద్వయం ఊహల్లో బతుకుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఆయన తన నియోజకవర్గమైన వయనాడ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇరువురు వారి ఊహల్లో బతకటం వల్ల ప్రజలు సమస్యల్లో ఉన్నారని అన్నారు. కాగా తనపై 16 కేసులు నమోదు అయ్యాయని, వాటిని తాను పతకాలుగా భావిస్తున్నానని, భయపడబోనని అన్నారు. ఆ కేసులతో తాను సైద్ధాంతికంగా పోరాడతానని చెప్పారు. మహిళలను, అన్ని జాతుల వారిని గౌరవించటంలోనే భారతదేశ బలం ఉందని అన్నారు. తనకు మద్దతుగా నిలిచినవారిని ఎన్నటికీ మర్చిపోనని అన్నారు.