జాతీయ వార్తలు

మోదీ ఓటమే కాంగ్రెస్ ధ్యేయం:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయబరేలి: 2019 ఎన్నికల్లో ప్రధాని మోదీని గద్దె దించటమే కాంగ్రెస్ ధ్యేయంగా ముందుకు వెళుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన యూపీలోని తన తల్లి సోనియా నియోజకవర్గమైన రాయబరేలిలో విలేకర్లతో మాట్లాడుతూ చైనా దేశం గంటకు యాభైవేల ఉద్యోగాలు ఇస్తుంటే మనదేశం మాత్రం కేవలం 450 ఉద్యోగాలను మాత్రమే ఇస్తుందని అన్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో ఇప్పటికే స్థానికులకు ఉద్యోగాలు కల్పించే ప్రతిపాదనలతో ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయని అన్నారు. తాను చేసిన వాగ్ధానాలను నూటికి నూటొక్క శాతం అమలుచేస్తానని, మోదీ వలే విస్మరించనని అన్నారు. ప్రియాంక వాద్రా రాజకీయ ప్రవేశం వల్ల ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు యువ నాయకులు సమర్థవంతంగా పనిచేస్తారని అన్నారు. ఎప్పటిలాగేనే రాహుల్ మోదీపై రైతురుణ మాఫీ, జిఎస్టీ, పెద్ద నోట్ల రద్దు అంశాలపై విరుచుపడ్డారు.