జాతీయ వార్తలు

‘ రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రకు అన్యాయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 14: రైల్వే బడ్జెట్ దేశ ప్రజలను నిరాశకు గురిచేసిందని తెలంగాణ కాంగ్రెస్ సభ్యులు ఎంఏ ఖాన్, ఆనంద భాస్కర్ విమర్శించారు. సోమవారం రాజ్యసభలో రైల్వే బడ్జెట్‌పై జరిగిన చర్చలో వారు పాల్గొంటూ విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్ ప్రకటించి ఉండాల్సిందని అన్నారు. బులెట్ రైళ్ల గురించి మాట్లాడే వారు సామాన్య ప్రజలను ఎందుకు విస్మరిస్తున్నారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ బులెట్ రైళ్లకు వ్యతిరేకం కాదని, కానీ సగటు మనిషి రైల్వే సౌకర్యాలు తీరకుండా బులెట్ రైళ్ల గురించి మాట్లాడటం సమంజసం కాదని వారు స్పష్టం చేశారు. బులెట్ రైళ్లతోపాటు ఇతర అన్ని రైళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచించారు. బులెట్ రైళ్లు రాగానే సామాన్య జనం ఉపయోగించే రైళ్లను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఖాన్ హెచ్చరించారు. రైలు చార్జీలు పెంచలేదు కానీ తత్కాల్ పథకం ద్వారా ధనవంతులకు సౌకర్యాలు పెంచారని వారు విమర్శించారు. తత్కాల్ పథకం బీద ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందన్నారు. రైల్వేకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్లను ఎందుకు పూర్తి చేయలేదని ఖాన్ ప్రశ్నించారు.