జాతీయ వార్తలు

సాధారణ బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ విలీనం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో విలీనం చేస్తూ కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ రూపకల్పన, సమర్పణలకు సంబంధించిన మొత్తం విధానాన్ని సంస్కరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 1924 నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరుగా ప్రవేశపెడుతున్నారు. దీనిని 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం వల్ల ఏటా రూ.10 వేల కోట్లు ఆదా అవుతుందని అంచనా. బడ్జెట్ సమర్పణ తేదీని కూడా ముందుకు జరపాలని నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలనే తేడాలను కూడా ఉపసంహరించాలని నిర్ణయించింది. బడ్జెట్‌ను సమర్పించే తేదీని ప్రభుత్వం త్వరలోనే నిర్ణయిస్తుంది.