ఆంధ్రప్రదేశ్‌

ఇంకా నీళ్లలోనే గూడూరు డివిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన రైల్వే అధికారులు
గూడూరు, డిసెంబర్ 3: భారీ వర్షాలు తగ్గినట్టే తగ్గే తగ్గి గురువారం మధ్యాహ్నం నుంచి మళ్లీ ప్రారంభం కావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొని వస్తుందోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఇప్పటికీ వరద ఉద్ధృతి తగ్గక పోవడంతో గూడూరు నుండి వెంకటగిరి మార్గం మినహా మిగతా మార్గాలకు రాక పోకలు నిలిచి పోయాయి. అనారోగ్యంతో బాధ పడే వారు, కాన్పుల కోసం ఆసుపత్రులకు రావాలన్నా వచ్చే దారి లేక వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. చెన్నై వెళ్లే పలు రైళ్లు ఒక్కోస్టేషన్‌లో ఒక్కొక్కటి వంతున ఆపేశారు. హౌరా - చెన్నై వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైలును గూడూరులో నిలిపి వేసి ఇందులో ప్రయాణిస్తున్న వారిని గూడూరునుంచి 14 ఆర్టీసీ బస్సుల్లో గమ్యం చేర్చారు. వరద ప్రవాహం ఇంకా శాంతించక పోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న గూడూరు మండలం వేములపాలెం, మధురెడ్డి కాలనీ వాసుల సమాచారాన్ని తెలుసుకొన్న గూడూరు అగ్నిమాపక అధికారి వి భాస్కర రావు నేతృత్వంలో రెస్క్యూ బృందం లైఫ్ జాకెట్లు ధరించి రోప్ సహాయంతో అనారోగ్యంతో బాధ పడుతున్న దాదాపు పది మందిని విందూరు రోడ్డులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటించి వారికి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరిపించారు. విజయవాడ నుండి చెన్నైకి వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్ రైలును గురువారం కూడా గూడూరువరకే నడిపారు. చెన్నైలో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో చెన్నై మార్గంలో గూడూరు మీదుగా వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను గురువారం కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే రైలు ప్రయాణికులు గూడూరు రైల్వే స్టేషన్‌లో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. భారీ వర్షాల కారణంగా కూరగాయల ధరలు గూడూరులో చుక్కలనంటాయి. టమోటా మినహా మిగతా కూరగాయలన్నీ కిలో వంద రూపాయల వంతున విక్రయిస్తున్నారు.