తెలంగాణ

నగరంలో భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో ఈరోజు భారీ వర్షం పడింది. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడటంతో నగరవాసులు ఇక్కట్ల పాలయ్యారు. జేఎన్‌టియూ, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, మూసాపేట, అమీర్‌పేట, ఖైరతాబాద్, కోఠి, శంషాబాద్, బంజరాహిల్స్, జూబ్లిహిల్స్, మాదాపూర్, రాజభవన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాగా నగరంలో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని, నగరవాసులు అవసరమైతే తప్ప ఆఫీసులు, ఇళ్లు దాటి బయటకు రావద్దని, కరెంట్ తీగలు, స్తంభాల వద్దకు వెళ్లవద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సూచించారు. రంగంలోకి విపత్తు నిర్వహణ, అత్యవసర బృందాలను దించామని తెలిపారు.