తెలంగాణ

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి కేటీఆర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెబుతోందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో అధికారులతో మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, నగరంలో పరిస్థితి అదుపులో ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని కోరారు. అవసరమైతే సైనిక బలగాలను రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉన్నాం. నగరంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. హుస్సేన్‌సాగర్‌ లోతట్టు ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశామని, ముంపునకు గురైన భండారీ లేఅవుట్‌, ఇతర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ప్రజలు ఎలాంటి పుకార్లు, దుష్ప్రచారాలు నమ్మవద్దని కోరారు.