తెలంగాణ

తెలంగాణలో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: అల్పపీడనం కారణంగా శనివారం నుంచే తెలంగాణ రాష్టంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తుండగా, సోమ, మంగళ, బుధ వారాల్లో తెలంగాణ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం సంచాలకుడు తెలిపారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి దగ్గరలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి అల్పపీడనంగా మారుతోందని, దాని ప్రభావం సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి చల్లని వాతావరణమేర్పడింది.