తెలంగాణ

రైతు బిడ్డంటే.. రాంరెడ్డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజా ప్రతినిధులకు ఆదర్శప్రాయుడు సిఎం సహా కొనియాడిన సభ్యులు
వెంకట్‌రెడ్డికి శాసనసభ ఘన నివాళి నేటికి వాయిదా
హైదరాబాద్, మార్చి 11: ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి శాసనసభ ఘన నివాళి ఆర్పించింది. రాష్ట్రం ఒక ఆదర్శ రైతుబిడ్డను, గొప్ప వ్యకిత్వం కలిగిన ప్రజాప్రతినిధిని కోల్పొయిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు కొనియాడారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండవ రోజు శుక్రవారం ప్రారంభం కాగానే దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి సంతాప తీర్మానాన్ని ప్రతిపాదించారు. సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాజకీయాల్లో రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సర్పంచ్‌స్థాయి నుంచి మంత్రి వరకు అంచెలంచేలుగ ఎదిగారన్నారు. ఒకవైపు ప్రజాప్రతినిధిగా ఉంటూనే, మరో వైపు ఆదర్శరైతుగా కూడా ఆయన రాణించారన్నారు. వ్యవసాయమన్నా, పశుపోషణనన్నా వెంకట్‌రెడ్డికి అమిత ఇష్టమని ముఖ్యమంత్రి అన్నారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వెంకట్‌రెడ్డికి మంచి చికిత్స అందించడానికి ప్రభుత్వపరంగా రూ. 84 లక్షల ఇచ్చినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయామని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట్‌రెడ్డి మరణం వ్యక్తిగతంగా కూడా తనను ఎంతగానో కలిచివేసిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి మాట్లాడుతూ, దివంగత వెంకట్‌రెడ్డితో తనకు 30 ఏళ్లుగా అనుబంధం ఉందని, ఆయన తనకు పరిచయం అయిన రోజుల్లో తాను వేరే పార్టీలో ఉండేవాడినని, అయినప్పటికీ తనకు ఎంతో సన్నిహితం అయ్యారని అన్నారు. వ్యవసాయమంటే ఎంతో మక్కువ కలిగిన ఆయన అసలు, సిసలైన రైతుబిడ్డగా రాణించారన్నారు. రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ, 1967లో రాజకీయ ప్రవేశం చేసిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయంగా మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగారన్నారు. కమ్యూనిస్టులకు కంచుకోట అయిన ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని బతికించిన వ్యక్తి వెంకట్‌రెడ్డేనని తుమ్మల కొనియాడారు. కాంగ్రెస్ శాసనసభ పక్షం ఉప నాయకురాలు జె గీతారెడ్డి మాట్లాడుతూ, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి తమ పార్టీ నాయకునిగానే కాకుండా తనతో పాటు సహచర మంత్రిగా పని చేశారన్నారు. ఈ సభలో తన బెంచిమెట్‌గా ఉన్న ఆయన మృతి తనకు ఎంతో మనస్థాపాన్ని కలిగించిందన్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధిని నాలుగేళ్లుగా జయించారని, ‘జో డర్‌గయా, వో మర్‌గయా’అని ఆయన ధైర్యం చెప్పేవారని గీతారెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ సభ్యుడు జి చిన్నారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒంగోలు గిత్తల పోటీ ఎక్కడ జరిగినా రాంరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా తన ఎద్దులను తోలుకొని వెళ్లి బహుమతులు గెలుచుకునే వారని గుర్తు చేశారు. రాంరెడ్డి వెంకట్‌రెడ్టి స్మారకార్థం ఏదైనా వ్యవసాయ సంస్థకు కానీ, కళాశాలకుగానీ నామకరణం చేయాలని కాంగ్రెస్ సభ్యులు డికె అరుణ, భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్ తదితరులు సూచించారు. సంతాప తీర్మానంపై ఇంకా బిజెపి సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, టిడిపి సభ్యుడు సండ్ర వీరయ్య, సిపిఐ సభ్యుడు రవీంధ్రకుమార్, సిపిఎం సభ్యుడు సున్నం రాజయ్య, వైఎస్‌ఆర్ సిపి సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు.