రాష్ట్రీయం

నేటి నుంచి భవానీల దీక్ష విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), డిసెంబర్ 30: సంసార దుఃఖ సాగర తరుణోపాయం కోసం 41రోజులుపాటు అత్యంత కఠిన నియమ నిష్ఠలను పాటించి భవానీలు గురువారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో దీక్ష విరమణ చేయనున్నారు. నిత్యం ఉదయం, సాయంత్రం, చన్నీటి స్నానమాచరించి శ్రీ అమ్మవారిని 108 నామాలు పఠించి రెండుపూటల దీపారాధన నిర్వహించుకొని 41వ రోజైన గురువారం శిరస్సుపై ఇరుముడి ధరించి గిరిప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శించుకొని హోమగుండంలో ఇరుముడిని సమర్పించుకొని గురుభవానీలచేత దీక్షా మాలను తీయించుకోవటంతో ఈ దీక్షా పరిసమాస్తం అవుతుంది. ఐదు రోజుల పాటు జరిగే దీక్ష విరమణలో సుమారు సుమారు 18 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని దుర్గ గుడి ఇఒ నరసింగరావు విస్తృత ఏర్పాట్లు చేశారు. కొండపైనా, కింద, భవానీలు, భక్తులకు అవసరమైన అన్ని రకాలైన వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. భవానీలకు సేవలు అందించటానికి 300 మంది డెప్యూటేషన్ సిబ్బంది, 7 వేల మంది వివిధ క్యాడర్లలో పోలీసులు తయారుగా ఉన్నారు. నిత్యం 10 వేల మందికి పైగా భవానీలకు అన్నదానం ఏర్పాటు చేయటంతోపాటు, అన్ని ఘాట్స్‌లో భవానీలకు అవసరమైన మంచినీటి వసతి, ఉచిత క్లోక్ రూమ్, మహిళలు దుస్తులు మార్చుకోవటానికి ప్రత్యేక వసతి, ఉచిత వైద్యశిబిరం, షవర్‌బాత్‌లు ఏర్పాటు చేశారు. భవానీలకు అమ్మవారి మహాప్రసాదాలైన లడ్డూలను సుమారు 15 లక్షల మేరకు సిద్ధం చేస్తున్నారు. కృష్ణనదీ నీటిమట్టాన్ని పెంచటంతోపాటు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆపించి తవ్విన గోతులను పూడ్పించి భవానీలు గిరిప్రదక్షణ చేసేందుకు అనువుగా కొండచుట్టు ఉన్న రోడ్లను సిద్ధం చేశారు. గురువారం ఉదయం 7 గంటలకు మల్లిఖార్జున మహామంటపం ఆవరణలో ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద దేవస్థానం ఆస్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్ దుర్గగుడి ఇవో సిహెచ్ నరసింగరావు, విజయలక్ష్మీ దంపతులతో ప్రత్యేక పూజలు చేయించటంతో అమ్మవారి సన్నిధిలో భవానీదీక్షల విరమణ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

హోదా కోసం చలో ఢిల్లీ

పిసిసి అధ్యక్షుడు రఘువీరా వెల్లడి

చంద్రగిరి, డిసెంబర్ 30 : విభజన నేపధ్యంలో రాష్ట్రానికి ఏదో మేలు చేస్తారని నరేంద్రమోదీని, చంద్రబాబును నమ్మి అధికారం ఇచ్చిన ప్రజల నోళ్లల్లో మట్టి కొట్టి, నీళ్లు పోస్తే చూస్తూ ఊరుకోబోమని పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కల్పించాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీలు కల్పించాలని గత రెండు నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మట్టి సత్యాగ్రహం కార్యక్రమం బుధవారం చంద్రగిరిలో ముగించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభకు పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని, ప్రజలు జీవితాలను అంధకారం చేయడానికి సంకల్పించారంటూ రఘువీరా నిప్పులు చెరిగారు. మట్టి సత్యాగ్రహం వారి కళ్లు తెరిపించడానికేనని అన్నారు. బాబు స్వగ్రామం నారావారిపల్లె సహా అన్ని ప్రాంతాల మట్టిని సేకరించి ప్రధానికి పంపిస్తున్నామన్నారు. దీనితో అయిన వారు ప్రత్యేక హోదాను ప్రకటిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. గతంలో కూడా ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేసిందన్నారు. తొందరలోనే చివరి దశగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనుమూరి బాపిరాజు, చింతామోహన్ తదితరులు బాబు వైఖరిని దుయ్యబట్టారు.

చంద్రగిరిలో మట్టి సత్యాగ్రహం ముగింపు సభ