రాజమండ్రి

ఇది బొంబాయి బుల్లిరో... శ్రీదేవి చెల్లిరో.. ( కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీరు అన్నదేం బాలేదు’ బాధగా అంది మాన్య.
‘నేనేమన్నాను?!’ ఆశ్చర్యంగా అన్నాడు చైతన్య
‘మీరు మా ఆవిడ నడిగి తీసుకోండి అనలేదు?’ దాదాపు ఏడుస్తూ అంది. ‘మరి ఇంకేం అనాలి?’ అన్నాడు.
‘మరి నేనెవరు! ఒక్కసారి మనసుబెట్టి ఆలోచించండి’ అప్పుడర్ధమయ్యింది. రెండో భార్యగా ఆమెను పెళ్లి చేసుకున్నందుకు.. కాని మాన్య గొప్పతనం ఏమంటే సాధింపులో కూడా అర్థింపు ఉంటుంది. ఆమె ఫీలింగు తప్పక అర్థమయ్యేలా చెబుతుంది. లేకపోతే విసుక్కునేవాడే. ‘సారీ! బంగారు! అది ఎలా చెప్పాలి? నిజంగానే అవి మా ఇంట్లో ఉన్నాయి గదా’ అని నాలుక్కరచుకున్నాడు.
‘అదిగో, మీకస్సలు నేను భార్యననే ఫీలింగ్ లేనేలేదు. అసలు ఎందుకు నన్ను ఇలా చేశారు. అంతా నా పిచ్చి. మీరు చెప్పిన ప్రతిదానికి తల ఊపి అన్నవరంలో తాళి కట్టించుకున్నాను’ ఏడుస్తుంటే కూడా అందంగా ఉంది మాన్య. ‘సత్యభామ కూడా ఇలాగే అందంగా రోదించేదట’ చిన్నగా ఆమె భుజాల చుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకుని ఆమె నుదుటిపై మద్దు పెట్టాడు చైతన్య. ‘ఎలా అనాలో నువ్వు చెప్పు!’
‘ఇంట్లో పెట్టాను. తనను అడిగి తెలుసుకోండి.’
‘వావ్! ఈ ఆడవాళ్లెంత తెలివిగల వాళ్లు! మరి నేను చేసిన రెండవ తప్పు ఎలా?’
‘అవి ఇక్కడ మన ఇంట్లో లేవని అలా చెప్పాను!’ కళ్లలో నీళ్లు అలాగే ఉన్నా నవ్వుతూ..
‘చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సుమీ.’
తను అందరిలాంటి మగవాడే. చాలా తప్పు చేశాడు. తన జీవితంలోకి మైకంలో వచ్చేశాడు, ఇప్పుడు సతమతమవుతున్నాడు. తన భార్యకు ఏ లోపం లేదు. అందమైనదే. అలా అని ఈ పెద్దలు చేసిన పెళ్లిలో ఏ స్పెషల్ లేదు. తన భార్య తనకు కావల్సిన ఏ ముచ్చట్లూ చెప్పదు. పాటలు పాడదు. సాహిత్యం మాట్లాడదు. ఆమె ఆమెకోసం కాదు పిల్లా జెల్లా, ఆడపడుచులకోసం.. ఇల్లు చాలా పరిశుభ్రంగా ఉంచుతుంది. అందరూ ఆమెను చూసి తాను చాలా అదృష్టవంతుడని కితాబు ఇచ్చేశారు. ఆమె పేరు శాంత. పేరుకు తగ్గట్టుగా శాంతంగా ఉంటుంది.
తాను గిటార్ నేర్చుకోడానికి మ్యూజిక్ క్లాసుకు వెళ్తుంటే ‘మాన్య’ పరిచయం అయ్యింది. అప్పటికే తాను పేరున్న కంపెనీలో డైరెక్టర్. తాను పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’ కథలో రావుగారు లాగా 35 వయస్సున్న వాడిలా కనబడతాడు. నిజానికి తాను స్ర్తిని వేరే దృష్టిలో ఎప్పుడూ చూడలేదు. కాని ఈ మాన్య చూపు, మెరుపు తనని హుదూద్ తుపాన్‌లా ముంచేసింది. చింతామణిలో బిల్వమంగళునిలా ఆ గానమాధుర్యంలో జీవితాంతం గడిపేయవచ్చని అనిపించింది. అన్నీ ఆరాతీస్తే ఆమెకు 30 ఏళ్లని, అందరినీ చదివించి పెళ్లిళ్లు చేసి తల్లికోసం వివాహం చేసుకోకుండా ఉండిపోయిందని తెలిసింది. ‘ఐ లవ్‌యు మాన్య’ చిన్న స్లిప్ మీద రాశాడు. ఆమెకు ఇలాంటివి కొత్తేం కాదు. నడి వయస్సులో ఉన్న వాళ్లు ‘ఐ లవ్ యులో ఐ వాంట్ యు’ మాత్రమే ఉంటుందని తెలియనంత అమాయకురాలు కాదు. ‘మీకు పెళ్లయింది కదా! ప్రేమ అవసరం అంటారు’
సూటిగా అడిగింది
‘ప్రేమ అవసరమేనేమో’ నసుగుతూ అన్నాడు.
ఆ మనిషి ఒ.కె అంటే డ్రాప్ అయిపోయేవాడేమో. కాని తను రిజక్ట్ చేస్తే మరీ పట్టుదల హెచ్చింది. ఆమె బ్యాగ్రౌండ్ ఇంకా అతనికి బలాన్నిచ్చింది. కారులో డైరెక్టుగా ఇంటికి వెళ్లాడు. ‘నేను నిజంగానే బ్రతకలేను’ నాకు రోజూ నిద్రపట్టడం లేదు.
‘అయితే స్లీపింగ్ పిల్ వేసుకోండి. అది మీ ప్రాబ్లెం’
‘నేను సిన్సియర్‌గానే అడుగుతున్నాను. ఆలోచించుకో. నిన్ను రెండవ భార్యగా చేసుకుంటాను.’
‘అంటే ఉంచుకుంటారన్నమాట’
‘్ఛ.. ఛీ .. ఎవరో అనవలసిన మాట నువ్వే అనేస్తున్నావ్’
‘వాళ్లు వీళ్లు ఇలా అంటారని మీకు తెలుసన్నమాట’ అతనిని గెటవుట్ అని ఎందుకు అనలేకపోతుందో అర్థం కాకుండా ఉంది.
‘ఎవరమ్మా?’ తల్లి గొంతు.
‘మా ఆఫీసులో పని చేస్తారమ్మా’ మాన్య.
‘సరే రేపు కలుద్దాం!..’ బయలుదేరాడు చైతన్య
ఆ రోజు దీపావళి. చెల్లెళ్లంతా వారి భర్తలతోసహా దిగారు. తలా ఒక వంట చేయమని మాన్యకు చెప్పారు. ఒకరికి బొబ్బట్లు, ఒకరికి గులాబ్ జామూన్, ఒకరికి పెరుగు వడలు, ఒకరికి కజ్జికాయ. అందరికీ బట్టలు, టపాసులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంతలో పెద్ద చెల్లి భర్త మీ అక్క కష్టజీవి కదా శ్రీజా!’ అంటున్నాడు
‘ఎవరికోసం చేస్తుంది. దానికి తాడా! బొంగరమా! అన్నీ తనకే వచ్చని, నలుగురూ మెచ్చుకోవాలని ఎవరికి తెలియదు. అమ్మ తరువాత ఈ ఆస్తిపాస్తులన్నీ తనవేనని దాని ఆలోచన.’
వింటున్న మాన్య నిరుత్తురు రాలైంది. ఏంటి తన చెల్లి ముద్దుల చెల్లి మనోగతం ఇదా! తట్టుకోలేక పోయింది.
‘తరువాతైనా మీకే గదా! అదేం కాదులే. ఎక్కడో పరాయి వాడు అర్థం చేసుకున్న విషయం కూడా తన చెల్లికి అర్థం కాలేదు. ఇంతలో తమ్ముడి భార్య ‘వదినా! మేమంతా సినిమాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం. చంటాడుకి పాలసీసా రెడీగా పెట్టాను. లేస్తే పట్టు. అక్కడ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయని మీ తమ్ముడు తీసుకువెళ్ల వద్దంటున్నారు. ప్లీజ్’ అంటే సినిమాకి వెళ్లే ప్రోగ్రాంలో తనను మైనస్ చేశారన్నమాట.
‘అక్కా! బట్టలు గంజి పెట్టాను. ఇస్ర్తి చెయ్యవూ. మా ఊళ్లో చీరకు రూ.10 తీసుకుంటున్నారు. అందుకే ఇక్కడకు తెచ్చాను.’
మాన్య అందరూ సినిమాకు వెళ్లాక ఆలోచించింది. తల్లికి కాఫీ కలిపి ఇస్తూ తాను ఓ కప్పు తాగుతూ ఒక నిర్ణయానికి వచ్చింది. అసలు తప్పుడు నిర్ణయాలన్నీ ఇలాంటి సంఘటనల వల్లే జరుగుతాయని తనకు అనిపిస్తుంది. విడాకులు పొందని మనిషిని పెళ్లి చేసుకోవడం నేరం. చట్ట విరుద్ధం. కాని ఈ వయసులో తనను పెళ్లాడటానికి వచ్చే మగాడు దరిదాపుల్లో లేడు. పైగా తనను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. తాను వాళ్ల కుటుంబానికి అడ్డు రాదు. కాని రహస్యం ఎప్పటికైనా బయటపడుతుంది. అది నిజం. అందుకే పెళ్లి చేసుకుని మొన్న ముంబాయిలో పాఠాలు కుదురుస్తానని ఒక స్టూడెంట్ మదర్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. నిర్ణయం తీసుకుని ముంబాయి మారిపోయింది. అతడు ముంబయిలో ఉండటానికి తన అంగీకారం తెలిపాడు.
పెళ్లి ఫొటోలు తీసుకుంది. అతని మీద కేసు పెట్టడానికి కాదు. తనకు అభద్రత నుండి దూరం కావడానికి కావల్సిన సాక్ష్యాలుగా మాత్రమే. వారానికి మూడ్రోజులకి క్యాంపుల పేరుతో ఫ్లైట్‌లో అతను వస్తాడు. తాను అతనిని అలరిస్తుందో అతడు తనకు భద్రతనిస్తాడో తెలియని అసంతృప్తి జీవితం జీవనం. ఏదైనా ఒక వారం పరిస్థితుల ప్రాబల్యం వలన రాకపోతే వదిలేశారేమోనని అనుకుంటుంది. సాధించాలని అనుకుంటుంది. సాధిస్తే అసలే రాకపోతేనో... మనసుకు సర్ది చెప్పుకుంటుంది. ఒక రోజు..
‘నీకు పిల్లలు కావాలనిపించడం లేదా మాన్య?’ తను తనడగవలసిన ప్రశ్న అతడే అడిగాడు. ‘కావాలనిపిస్తుంది’ ఏదో పరధ్యానంగా అంది. ‘అయితే ఇటువంటి బాపూ బొమ్మకు, నా వంటి తెలివైన వాడికి మంచి సంతానం కలుగుతుంది. ఆస్తిపాస్తులు కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఓకేనా!’ ఆమె ఆ ఏర్పాటు చేస్తానన్న పదం గుండెల్లో గాయం చేసింది. ఏదో ముష్టి వేస్తానన్నట్టు. ఇంకా తన సంతానం ఎవరి ఆస్తో దోచుకుంటానికి పుడతానన్నట్టు ఆమె పేలవంగా నవ్వింది. ఆమె చెప్పడం ప్రారంభించింది.
‘నేను ఈ పెళ్లి చేసుకున్నది చాలా చాలా బలమైన క్షణంలో ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను సంతానం అంటూ కంటే నా సంపాదనతోనే పెంచుతాను. కాని నేను కనాలనుకోవడం లేదు. మీకు పిల్లలవసరం ఉందని నేననుకోను. ఎందుకంటే నీకు కావాలనిపించడం లేదు! అని అడిగారు. నాకు కావాలి. మన ప్రతిరూపం అని అనలేదు. కాని ఓ అమ్మాయిని అనాథ శరణాలయం నుండి తెచ్చి పెంచుకుందామనుకుంటాను. రాయిని శిల్పంలా తీర్చగలనని నాకు నమ్మకం.
‘దీనికి నేనిష్టపడను. ఎవరికో పుట్టిన వారికి క్రమశిక్షణ ఉండదు. మంచి లక్షణాలుండవ్’ కోపంగా అన్నాడు చైతన్య.
‘చాలా మంచి లక్షణాలతో మంచి బుద్ధులతో పెరిగిన మనం, ఉన్నతమైన సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన మనం ఏం చేశాం?’ అమె అలా నిలదీస్తుందని అంత కఠినంగా మాట్లాడగలదని అతనూహించలేదు.
‘మాన్య! నువ్వేనా మాట్లాడేది’
‘నన్ను క్షమించండి’ కాళ్లు పట్టుకుంది. ఆమె కఠినంగా అతనిని ఎప్పుడూ మాట్లాడదు. ఫ్లైట్‌కి టైమయ్యిందని అతను వెళ్లిపోయాడు.
‘మాన్య! ఐ లవ్‌యు’ చెవిలో గుసగుసగా మాట్లాడుతున్న భర్తను చూసి లేచి కూర్చుంది. కేక్ కట్‌చేస్తూ ‘హేపీ బర్త్‌డే టు యూ’ అని. చైతన్య వెనువెంటనే నాలుగు నెలలున్న ఓ అందమైన పాపాయని ఆమె ఒళ్లో పెట్టాడు. విస్మయంతో చూస్తున్న ఆమెకు చెప్పాడు. ‘అనాథ శరణాలయం నుండే తెచ్చాను. ‘మన’ కూతురికి తండ్రిగా కొంత ఎవౌంట్ కూడా వేశాను. ‘మన’ డబ్బుతోనే తింటుంది. ‘మన’ డబ్బుతోనే చదువుతుంది. మన డబ్బుతోనే పెరుగుతుంది. ఇన్ని ‘మన’లు తట్టుకోలేనంత సంతోషాన్నిస్తుంటే.. పాపని పడుకోబెట్టి అతనిని కౌగలించుకుని ముఖాన్ని గుండెల్లో దాచుకుంది మాన్య.
‘ఇది బొంబాయి బుల్లిరో... శ్రీదేవి చెల్లిరో... ఓ పట్టు పట్టాలిరో...’ అంటూ హుషారుగా ఈలవేస్తూ చైతన్య ఆమె బుగ్గన చిటికె వేశాడు తన్మయంగా...

- బిహెచ్ రమాదేవి,
సెల్: 94415 99321

పుస్తక పరిచయం

అక్షర నేస్తం

తెలుగు సాహిత్యంలో చాలా మంది కవుల కవిత్వం మనం చదివి ఉండవచ్చు. మంచి పేరున్న వారి కవితలే గొప్పవని మనం అపోహపడతాం. ఎటువంటి పేరునూ ఆశించకుండా కవిత్వం రాసిన వారు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వారి కవిత్వం ప్రపంచానికి పరిచయం కాలేదు. ఇటువంటి వారు జీవితంలో జరిగిన సంఘటనలే కవిత్వంగా మార్చుకున్నారు.
-్యళఆక జఒ ఆ్దళ ళ్ఘఔ ఘూఆ యచి ళ్ఘ ఘశజూ ఆఖళ జజూళ్ఘఒ, ఘశజూ శ్యఆ చ్ఘిఒళ ఒళశఒ్ఘఆజ్యశఒ
అన్నట్టుగా వీరు సెనే్సషన్ కోసం, పేరుకోసం పాకులాడరు. ఇటువంటి వారి కవిత చదివినపుడు శ్రీశ్రీ కవితలకన్నా ఎక్కువ మనపై ప్రభావం చూపవచ్చు. అటువంటి కోవకు చెందిందే పెద్దాపురం కవి జోష్యుల కృష్ణబాబు గారు రాసిన ‘అక్షర నేస్తం’ కవితా సంకలనం. ఒక లోతైన భావం పటిష్టమైన వాక్య నిర్మాణం, పదునైన భాష వెరసి ‘అక్షర నేస్తం’ అని చెప్పాలి. వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా అక్షర నేస్తం చదివితే కవిని ఎవరైనా ప్రేమించవలసిందే. సామాజిక నిబద్ధత, సామాజిక చైతన్యం వస్తువుగా కలిగిన అక్షర నేస్తం సాహితీ ప్రియుల మనసుని పట్టుకుంటుంది. సాహిత్యపరంగా కృష్ణబాబు వెలిగించిన భావాలు పెద్దాపురంలోనే కాదు సమాజంలోనే శాశ్వతంగా జీవిస్తాయి. తన జీవితాన్ని కవిత్వంగా మార్చి సృజించిన ఒక అద్భుతం అక్షర నేస్తం.
అక్షర నేస్తం - ముందు మాటలో అద్దేపల్లి రామ్మోహనరావు మాట్లాడుతూ ‘కవులు ఎంత విభిన్న వస్తువులతో రాసినా ‘సాంస్కృతిక విధ్వంసం ఏదో ఒక రూపంలో అందరు కవుల్లోనూ కనిపిస్తుంది. జోష్యుల కృష్ణబాబు ఆ కోవలో మంచి కవితలు రాస్తున్నారు. ఆయన కవితా సంపుటి అక్షర నేస్తం అందుకు నిదర్శనంగా నిలుస్తుందంటారు. అక్షర నేస్తం కవితా సంపుటిలో ‘నాన్న... నాలోనే ఉన్నారు’ కవిత ఒక అద్భుతం.
‘అసలు నాన్న - నా బిడ్డకు తండ్రి రూపంలో
నాలోనే ఉన్నావపిస్తుంది
అవును అదే నిజం.
లేకపోతే ఆయన నిష్క్రమించాక కూడా
నేనెలా ఉండగలను...’
అన్న కవి ప్రశ్నతో తండ్రులు చనిపోరని, వాళ్లు తండ్రులయ్యాక వాళ్లతో బతికే ఉంటారని సాహితీప్రియులకు ఊరట కలుగుతుంది. కృష్ణబాబు జీవితంకన్నా జీవితానికే ఎక్కవ విలువనిచ్చారు. అధ్యాపకత్వాన్ని ఆరాధించాడు. తెలుగును శ్వాసించాడు, శిష్యులను ప్రేమించాడు. ‘నా మది నిండిన ప్రాంగణం’ - కవితలో తన కళాశాల గురించి...
‘మళ్లీ తెలుగువాడిగానే పుట్టాలని’
తెలుగు అధ్యాపకుడిగా రాలిపోవాలని
మళ్లీ ఎందరెందరో శిష్యుల హృదయాల్లో
చిరస్థాయిగా నిలిచిపోవాలని
ప్రగాఢమైన వాంఛతో
నిరీక్షిస్తున్నాను’
ఈ కవిత చదివాక కాలేజీని తన తోటి అధ్యాపకుల్ని అంతకన్నా ఎక్కువగా శిష్యుల్ని ఎంతగా ప్రేమించారో అర్థం అవుతుంది. తన తోటి అధ్యాపకుడు ఆలపాటి సుబ్బారావు గారన్నట్టు ‘మహారాణి కళాశాలకు దొరికిన ఒక ఆణిముత్యం జోష్యుల కృష్ణబాబు’
ఇవి కొన్ని మాత్రమే. ఈ పుస్తకం తిరగేస్తే మన జీవితానికి సంబంధించిన భావోద్వేగాలు, అనువాదాలు, సంతాపాలుగా అన్నీ నెమరు వేసుకోగలుగుతాము.

- కె శివ (అప్పారావు),
తెలుగు పండిట్, పెద్దాపురం
జనవాక్యం

‘స్వచ్ఛ’మవుతున్న భారత్

స్వేచ్ఛ కన్నా స్వచ్ఛత మిన్న అని ఈనాడు నరేంద్రమోదీ నిరూపించారు. దేశాన్ని పరిశుభ్రంగా మార్చడానికి మనకు పచ్చని స్వచ్ఛతను ఇవ్వడానికి ఆయన నాటిన మొక్క ‘స్వచ్ఛ భారత్’. గాంధీజీ కన్న ‘క్లీన్ ఇండియా’ కలలు ఈనాడు నెరవేరబోతున్నాయి. మురికివాడలకు, బురదనీటి కాలువలకు భయంకరమైన వ్యాధులకు ఇక సెలవంటున్నారు. పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇచ్చి, స్వచ్ఛతకు మార్గానిచ్చారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడమే సంకల్పంగా మార్చకున్నారు. మార్పు ఒకరితో మొదలయ్యి, ఒకరితోనే ఆగిపోకూడదు. అది అంచలంచెలుగా ఎదగాలి. మన దేశాన్ని ఒక గొప్ప బృందావనంగా ఇకపై మనమే మలచుకుందాం. స్వచ్ఛతను తీర్చిదిద్దుకుందాం. భావితరాలను పచ్చదనంతో కాపాడుకుందాం.

- పి.లావణ్య
థర్డ్ బిఎస్సీ (ఎంఇసిఎస్)
రాజమండ్రి

రచనలకు ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు,
కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు,
పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి
అచ్చురూపం ఇచ్చి, ఆవిష్కరించే
అద్భుత అవకాశమే ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను
మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను
కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

విశ్వాసపు చిరునామా
విశ్వానికే ఆదర్శం
విశ్వాసానికి శునకం
ప్రేమించే వాళ్లకు ప్రియ నేస్తం
బాధించే వాళ్లకు యమపాశం
వేస్తుంది నిఘా వచ్చే ప్రతివారిపై
వేచివేచి చూస్తుంది యజమాని రాకకై
ప్రతి చిన్న శబ్దాన్ని పసిగట్టివేస్తుంది
ప్రేమున్న వారిపై పైపైకి పడుతుంది
కాస్తుంది కాపలా కోటాను కోట్లను
తను మాత్రం తింటుంది తినిపారేసిన బొమికలను
పాతిపెట్టిన శవాల్ని సైతం పసిగట్టి పడుతుంది
పూడ్చిపెట్టిన బాంబుల్ని కూడా పైకి తీసిపెడుతుంది
క్లిష్టమైన కేసులకు సైతం కావాలి కనిపెట్టేందుకు
ఆఖరికి పోలీసులకు కూడా
కావాలి కుక్కల సాయం
చేస్తుంది కాసేపు బికారిని కూడా రాజుగా
భటుని వలె కూర్చుని కాళ్ల వద్ద బుద్ధిగా
మానవాళికి మహమంచి నేస్తమా!
నోరులేని ఓ శునక రాజమా!
మరి రారెవరు నీకు పోటీ
విశ్వాసానికి నీకు నువ్వే సాటి

- ఆనాపు అప్పారావు,
సెల్: 92471 82469

మనం మనుషులం !
పిలిస్తే సొమ్ము చేతికొస్తుంది !
పిలవకపోతే ఇంటికొస్తుంది !
కనీస అవసరాలకు కొంతమంది పిలిస్తే...
ఆశలు తీర్చుకోడానికి కొందరు
అత్యాశకు పోయి ఆహ్వానించేది ఇంకొందరు
దురాశతో ధైర్యం చేసినవారూ ఉన్నారు
వడ్డీలు భారమని తెలిసినా
వేరొకరి మీద భారం మోపవచ్చునని ధీమా !
ఆశాపరులు అడియాశకు లోనైతే
దిక్కులేని దీనుల స్థితే విలవిల...
కాలనాగని తెలిసినా
కడుపులు నింపుకోడానికి వేరే దారి లేదు
నారుపోసిన వాడు పోసిన నీరు
ఇదేననుకున్నారు
దైవం మీద నమ్మకమున్నవారు వీరే !
కడుపులు నింపడం మాట ఎలావున్నా !
మాట నిలబెట్టుకోడానికి
మానం ఫణమయ్యింది!
అసలు దీనికోసమే సొమ్ముల పిలుపేమో !
ఆశ ధనం మీద అయితే
మానభంగం ఎందుకు ?
ప్రజలచేత ఎన్నుకోబడ్డ
ప్రజల ప్రభుత్వం
రావణ
తారక
నరక
అసురులతో అపహాస్యం...
స్వామ్యమంటే ఇదేనా !
బలహీనతను పెంచడం
బలంతో దోచడం
కండకావరం కాదా !
తలలో విషముంది కదాని
తోకను మర్చిపోతే ఎలా ?
చలిచీమల బలం తోకతోనే మొదలు
కాలకూట విషాన్ని కూడ
పంచుకుని పండగ చేసుకోగలవు!
జర భద్రం...!
మనం మనుషులం !!

- వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
సీతంపేట, రాజమహేంద్రవరం
94911 71327

అద్భుత నటనా శిల్పి
సినీరంగుల ఆకాశంలో
చిత్రాల్లో నటించిన రంగనాథ్
జన హృదయాల్లో సుందర రూపం
ఇంకా స్పందిస్తూనే ఉంది
ఒంటరి జీవితాన్ని భరించలేక
మృత్యు స్పర్శకు
నిశ్శబ్దంగా జీవితాన్ని చాలించిన నట శిల్పి
కాలం తెరపై
నటించలేక అపూర్వ నటనా స్ఫూర్తిని
జ్ఞాపకాలను మిగిల్చి
తనువు చాలించి
ప్రేక్షకులకు విషాదం అందించి
సుదూర సుదీర్ఘ నటనా
జీవితానికి
ముగింపు పలికి
మా కళ్లల్లో కన్నీరు నిండగా
మీ రూపం
మా గుండె తెరమీద
ప్రవహిస్తూనే ఉంది చీకటిలో

- నల్లా నరసింహమూర్తి
తెలుగు లెక్చరర్, కురసాల వారి వీధి
అమలాపురం, చరవాణి- 92475 77501

అంకితం
ఓ మనిషీ !
నీకుందా మానవత్వం
ఎందుకు నాపై ఈ అఘాయిత్యం
నీవు అలిసిపోతే నీడు నీడను ఇచ్చా
నీవు నిర్మించే ఇంటికి కలపనై వచ్చా
అయినా నీవు నాపై చూపే ప్రేమ ఇదేనా
నీవు వదిలిన కార్బన్‌డై ఆక్సైడ్‌ను నేను తీసుకుని
నీకు ప్రాణవాయువు ఆక్సిజన్‌ను అందిస్తున్నాను
నీవు పండించే భూమికి
భూసారం పోకుండా కాపాడుతూ
నీవు శ్వాస విడిచిన తరువాత కూడ
నేను మండిపోతూ
నిన్ను దహించుతున్నాను కట్టెనై
నిత్యం నా జీవితం నీకే అంకితం
అయినా...
ఎందుకు నన్ను నరికి బాధిస్తున్నావు...
ఒక్కసారి ఆలోచించు మిత్రమా !

- చింతా రాంబాబు, కాట్రేనికోన

email: merupurjy@andhrabhoomi.net

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.
email: merupurjy@andhrabhoomi.net

- బిహెచ్ రమాదేవి