జాతీయ వార్తలు

మాట మార్చడం ఓ పెద్ద కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇషత్ జహాన్ వ్యవహారంలో కాంగ్రెస్‌పై రాజ్‌నాథ్ ధ్వజం
న్యూఢిల్లీ, మార్చి 10: ఇషత్ జహాన్‌కు లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థతో ఉన్న సంబంధాల విషయంలో మాటమార్చిన కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ ‘ఈ రోజు భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచం ఉగ్రవాద జాడ్యాన్ని ఎదుర్కొంటోంది. అందువల్ల ఉగ్రవాదానికి సంబంధించిన ఏ అంశాన్ని రాజకీయం చేయకూడదు’ అని అన్నారు. యుపిఎ ప్రభుత్వం మొదటి అఫిడవిట్‌లో ఇషత్ జహాన్.. లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాది అని పేర్కొందని, కాని, రెండో అఫిడవిట్‌లో ఈ వాస్తవాన్ని బలహీనపరచడానికి ప్రయత్నించిందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. యుపిఎ ప్రభుత్వం తొలి అఫిడవిట్‌లో పేర్కొన్న వాస్తవాన్ని ఇటీవలి హెడ్లీ వాంగ్మూలం ధ్రువీకరించిందని మంత్రి అన్నారు. ‘అది ఇషత్ జహాన్ కేసు కాని మరో కేసు కాని ఏ ప్రభుత్వమైనా మాట మార్చకూడదు’ అని రాజ్‌నాథ్ సింగ్ పరోక్షంగా కాంగ్రెస్‌కు హితవు పలికారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి, ఇతరులను ఇరికించే కుట్రగా అది కనపడుతోందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘కాషాయ ఉగ్రవాదం’ అనే పదాన్ని ఉపయోగిస్తున్నందుకు కూడా కాంగ్రెస్ పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు. లౌకికవాదులుగా చెప్పుకుంటున్న వారే ‘కాషాయ ఉగ్రవాదం’ అని పేర్కొనడం ద్వారా ఉగ్రవాదానికి మతం రంగు పులిమారని రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు.