జాతీయ వార్తలు

పటిష్ఠంగా నిఘా వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే అత్యంత ముఖ్యమైన ఆయుధం
ఎస్‌ఎస్‌బికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ పిలుపు

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: నేపాల్, భూటాన్ సరిహద్దుల రక్షణ విధులు నిర్వహిస్తున్న శాస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బి) దళాలు శత్రువుల, ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించే నైపుణ్యానికి పదును పెట్టుకోవాలని ఎస్‌ఎస్‌బి దళాలకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించినప్పుడే ఉగ్రవాద ముఠాలు పరస్పరం కలువకుండా, అవి భారత్‌కు వ్యతిరేకంగా ఆటవిక దాడులకు తెగబడకుండా నివారించడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ఎస్‌ఎస్‌బి 52వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఇక్కడి ఆ దళాల శిబిరంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ సున్నితమైన ఈ రెండు సరిహద్దుల పొడవునా పదునైన నిఘా వ్యవస్థే అత్యంత ముఖ్యమైన ఆయుధమని పేర్కొన్నారు.
నేపాల్, భూటాన్‌లతో తనకున్న స్నేహ సంబంధాల వల్ల భారత్ ఆ రెండు దేశాలతో ఉన్న సరిహద్దుల పొడవునా కంచె ఏర్పాటు చేయకుండా వదలివేసింది. ఈ రెండు దేశాలతో ఉన్న సరిహద్దుల రక్షణ బాధ్యతను ఎక్స్‌టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘రా’నుంచి తప్పించి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అప్పగించారు. దీంతో హోంమంత్రిత్వ శాఖ 2001లో ఈ రెండు సరిహద్దుల కాపలా బాధ్యతను ఎస్‌ఎస్‌బికి అప్పగించింది. ‘నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో ఎలాంటి జాతి వ్యతిరేక కార్యకలాపాలనయినా, నేర కార్యకలాపాలనయినా నిరోధించడంలో సరిహద్దు రక్షణ దళంగా మీరు విజయవంతం అవుతారనే గట్టి విశ్వాసం నాకు ఉంది. మీకు ఒక ప్రత్యేకత ఉంది. అదే నిఘా వ్యవస్థ. మీకున్న అనుభవం, మీరు చేసిన మంచి పని ఆధారంగా మీరు మీ నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసుకోవాల్సి ఉంది. ఈ నిఘా వ్యవస్థ సమీప భవిష్యత్తులో మరింత ముఖ్యమైన పాత్ర పోషించగలదు’ అని రాజ్‌నాథ్ సింగ్ ఎస్‌ఎస్‌బి అధికారులను, జవాన్లను ఉద్దేశించి అన్నారు. ఎస్‌ఎస్‌బి నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయడంలో భాగంగా సైనికులకు, పారా మిలిటరీ సైనికులకు ఇస్తున్న సౌకర్యాలన్నింటిని ఎస్‌ఎస్‌బిలో పనిచేస్తున్న సైనికేతరులకు కూడా కల్పించాలని ఆ దళం పంపిన తాజా ప్రతిపాదనను తమ మంత్రిత్వ శాఖ లోతుగా పరిశీలిస్తోందని రాజ్‌నాథ్ వెల్లడించారు.
(చిత్రం) ఎస్‌ఎస్‌బి 52వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్