జాతీయ వార్తలు

అదుపులోనే ఉగ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోల కార్యకలాపాలనూ నియంత్రించగలిగాం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్

లక్నో, డిసెంబర్ 28: దేశంలో తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టుల కార్యకలాపాలను గణనీయంగా అణచివేయడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతమయిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) లక్నో బ్రాంచ్ కార్యాలయ నిర్మాణానికి ఆయన సోమవారం ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఐఏ సాధించిన విజయాలను ప్రశంసించారు. ‘మేము తీవ్రవాదం, ఉగ్రవాదం, మావోయిస్టుల కార్యకలాపాలను విస్తృత స్థాయిలో అణచివేయగలిగాం. ఈ అణచివేతను ఇదే వేగంతో కొనసాగిస్తే భవిష్యత్తులో మేము మరిన్ని విజయాలు సాధిస్తాం’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘ఎన్‌ఐఏ జటిలమైన క్రిమినల్ కేసులను దర్యాప్తు చేస్తుంది.. తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మావోయిస్టుల పాత్ర అంతర్జాతీయ స్థాయిలో ఉంది. అందువల్ల ఈ దర్యాప్తు సంస్థ పాత్ర మరింత సవాలుగా మారింది’ అని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లని అభివర్ణిస్తూ, ఈ శక్తుల నుంచి ఎదురయ్యే భద్రతా సవాళ్లను తిప్పికొట్టడానికి దర్యాప్తు సంస్థలు ఆధునిక సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని ఆయన నొక్కి చెప్పారు.
నేరస్థులు నేడు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను వినియోగించుకుంటున్నారని, అందువల్ల దర్యాప్తు సంస్థలు కూడా పాత పద్ధతులకు స్వస్తి పలికి నూతన సాంకేతిక నైపుణ్యాన్ని అనుసరించాలని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఎన్‌ఐఏ పనిచేస్తున్న తీరును చూశాక దేశ ప్రజలే కాకుండా మొత్తం ప్రపంచం ఇది వృత్తి విలువలతో నిష్పక్షపాతంగా విశ్వసనీయతతో పనిచేస్తున్న ఉత్తమ సంస్థ అని నమ్మడం మొదలుపెట్టారని ఆయన అన్నారు. ఒకవైపు ప్రపంచానికి కొత్త, తీవ్రమయిన ముప్పుగా ఐఎస్‌ఐఎస్ అవతరించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, దేశంలో ఈ ఉగ్రవాద సంస్థ కార్యకర్తల సంఖ్య దాదాపు శూన్యమని ఆయన అన్నారు. దీనికి పెద్ద కారణం భారత్‌లోని ముస్లిం కుటుంబాలు తమ పిల్లలను ఈ ఉగ్రవాద సంస్థ పంథాలోకి వెళ్లకుండా ఆపుకుంటున్నాయని మంత్రి వివరించారు. దేశంలో ఐఎస్‌ఐఎస్ భయం అక్కడక్కడా ఉండొచ్చని పేర్కొంటూ దేశంలోని మెజారిటీ ప్రజలకు భారతీయ విలువల పట్ల విశ్వాసం ఉన్నందున ఐఎస్‌ఐఎస్ ఇక్కడ తన ప్రభావాన్ని చూపలేదనే ప్రగాఢ విశ్వాసం తనకుందని మంత్రి తెలిపారు.
** ఎన్‌ఐఏ లక్నో బ్రాంచ్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న రాజ్‌నాథ్‌సింగ్ **