అంతర్జాతీయం

మోదీని చూసి నేర్చుకోండి: నవాజ్‌కు రాఖీ సలహా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పాకిస్తాన్‌లో యువతులను, బాలికలను హతమార్చడం దారుణమని బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో వివాదాస్పద మోడల్ ఖండీల్ బలోచ్‌ను ఆమె సోదరుడు గఫూర్ హత్య చేయడంతో ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇకనైనా మేల్కొనాలని సూచించింది. ఆడపిల్లల సంక్షేమానికి భారత ప్రధాని మోదీ అమలు చేస్తున్న ‘బేటీ బచావ్.. బేటీ పఢావ్’ కార్యక్రమాన్ని చూసైనా నవాజ్ షరీఫ్ మహిళలకు పాక్ ప్రజలు గౌరవం ఇచ్చేలా చట్టాలు తీసుకుని రావాలని రాఖీ కోరుతోంది. సామాజిక మీడియాలో ఫొటోలు పెట్టినంత మాత్రాన పాక్ మోడల్ బలోచ్‌ను హత్యచేసే అధికారం ఆమె సోదరుడు గఫూర్‌కు ఎక్కడిదని ఆమె ప్రశ్నించింది. మహిళల హక్కులను హరించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది.