జాతీయ వార్తలు

అఖండ భారత్ అవతరణ తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్, పాక్, బంగ్లాదేశ్ ప్రజల అభీష్టం మేరకే జరుగుతుంది
చారిత్రక కారణాలతోనే భారత్‌లో పాక్, బంగ్లాదేశ్ విలీనం
బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ధీమా

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: అరవై సంవత్సరాల క్రితం విడిపోయిన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు భవిష్యత్తులో తిరిగి కలిసిపోయి అఖండ భారత్ అవుతాయని బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చెప్పారు. రాంమాధవ్ శనివారం అల్‌జజీరా టివి చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. చారిత్రాత్మక కారణాల మూలంగా అరవై సంవత్సరాల క్రితం విడిపోయిన భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ప్రజల అభీష్టం మేరకు ఒకటైపోతాయని విశ్వసిస్తున్నట్లు రాంమాధవ్ తెలిపారు. అఖండ భారత ఏర్పాటు యుద్ధం ద్వారా జరగదని, కేవలం మూడు దేశాల ప్రజలు కోరుకుంటేనే జరుగుతుందని, భవిష్యత్తులో మూడు దేశాల ప్రజలు కలిసిపోవాలనుకునే అవకాశాలు లేకపోలేదని ఆయన వివరించారు. అఖండ భారత ఏర్పాటు కోసం తాము యుద్ధం చేస్తామనుకోవద్దని, యుద్ధం ద్వారా అఖండ భారత్ ఏర్పడదని ఆయన స్పష్టం చేశారు. ఇతర పద్ధతుల ద్వారా మరో దేశాన్ని స్వాధీనం చేసుకోవటం కూడా జరగదని, కేవలం ప్రజల అభీష్టం మేరకే ఇది జరుగుతుందని రాంమాధవ్ తెలిపారు.
దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ వస్తున్న ఆరోపణల గురించి మాట్లాడుతూ కళాకారులు, శాస్తవ్రేత్తలు, ఇతర ప్రముఖులు తమకు ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వాపస్ చేసి ఉండాల్సింది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రముఖులు తమ అవార్డులను తిరిగి ఇచ్చివేయటం వల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని రాంమాధవ్ అభిప్రాయపడ్డారు. మేధావులు తమ నిరసన తెలిపేందుకు అవలంభించిన పద్ధతి కూడా సరయింది కాదని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని చెబుతూ పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ అనేది అసలు సమస్యని ఆయన తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను వదులుకుంటే ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. మూడు దేశాల ప్రజలు కోరుకున్న రోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్ భారతదేశంలో విలీనమవుతాయని రాంమాధవ్ అభిప్రాయపడ్డారు.
చారిత్రాత్మక కారణాల మూలంగా విడిపోయిన మూడు దేశాలు మళ్లీ చారిత్రాత్మక కారణాల మూలంగా కలిసిపోతాయని రాంమాధవ్ చెప్పారు. భారతదేశం హిందూ దేశమంటూ గతంలో చేసిన ప్రకటన గురించి అడిగిన ప్రశ్నకు రాంమాధవ్ బదులిస్తూ ఒక విధమైన పద్ధతి, జీవన విధానాన్ని అవలంబించే దేశమని, ఒక రకమైన సభ్యత, సంస్కృతిని పాటించే దేశమని, దీనిని తాము హిందూదేశం అంటామని వివరించారు. జమ్మూకాశ్మీర్ ప్రజల రాజకీయ కోరికలను తీర్చటం జరుగుతుందంటూ దేశం నుండి విడిపోవటం మినహా మిగతా అన్ని డిమాండ్లను ఆమోదిస్తారని రాంమాధవ్ చెప్పారు.