సబ్ ఫీచర్

కలగా మిగిలిన రామమందిర నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసెంబర్ 6వ తేదీని వివిధ ముస్లిం సంస్థలు, వారి సర్వకాల స్నేహితులు, కమ్యూనిస్టులు-రక రకాల అంత్య ప్రత్యయాలను తగిలిగించుకున్నవారు- ప్రముఖ మార్కిస్టు మేధావులు ‘బ్లాక్ డే’గా పాటించారు. 1992, డిసెంబర్ 6వ తేదీన బాబ్రి కట్టడాన్ని కూల్చివేయడం వీరు ఈ విధంగా బ్లాక్ డేను పాటించడానికి ప్రధాన కారణం. మరి ఈ కట్టడాన్ని, అంతకు ముందున్న ఒక దేవాలయాన్ని ధ్వంసం చేసి, అపవిత్రం చేసి దాని శిథిలాలపై, మీర్ బుకి అనే ఒక షియా సైనిక నాయకుడు నిర్మించాడని అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2010లో స్పష్టంగా తీర్పు చెప్పింది. ఈ మీర్ బుకి, సున్నీ చొరబాటుదారుడైన బాబర్‌కు సేనానాయకుడు. హైకోర్టు ఆదేశాల మేరకు పురావస్తు శాఖవారు రాడార్‌ల ద్వారా శబ్దతరంగాలను భూగర్భంలోకి పంపి, కూల్చివేసిన కట్టడం చుట్టుపక్కల తీసిన చిత్రాలు, ఇతర పరిశోధనల ఫలితాలను సునిశితంగా అధ్యయనం చేసిన తర్వాత హైకోర్టు ధర్మాసనం పై విధంగా తీర్పు చెప్పింది.
అత్యంత శాస్ర్తియ పరిశోధనతో పాటు న్యాయశాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించి ఇచ్చిన హైకోర్టు తీర్పును... ‘ప్రముఖ’ మార్క్సిస్టు చరిత్రకారులు కొందరు, మరికొన్ని ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదాన్ని, తమ చర్యతో మరింత సాగతీతకు దోహదం చేశారు. ఇటువంటి నిరోధకుల వ్యవహారశైలిపై మెజారిటీ మతస్థుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. హిందువులను తీవ్రంగా అవమానించే రీతిలో ఈ మసీదును నిర్మించారు. రెండువందల సంవత్సరాల బ్రిటిష్‌వారి పాలన, అంతకు ముందు మధ్య ఆసియా దేశాలనుంచి మనదేశంలోకి చొరబడి పాలించిన ముస్లిం పాలకుల పాలన అంతరించిపోయింది. ఇప్పుడు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగుతున్నాం. అయినప్పటికీ కొన్ని వేల సంవత్సరాలుగా రాముడి జన్మస్థలంగా పరిగణిస్తున్న ప్రదేశంలో ఇప్పటికీ రామ మందిరాన్ని హిందువులు నిర్మించుకోలేకపోవడమే విషాదం.
ఏడువందల ఏళ్లపాటు పాలించిన ముస్లింలను పారద్రోలిన స్పెయిన్ వారు 1499లో మసీదులను కూలగొట్టి వాటి స్థానంలో చర్చిలను నిర్మించారు. ఆ తర్వాత ముస్లిం పాలకులు విజయం సాధించినప్పుడల్లా చర్చిలను తిరిగి మసీదులుగా మార్చడం చరిత్ర. స్పానిష్ క్రైస్తవులు ‘‘మతం మారండి లేదా దేశం వదలి పొండి’’’ అనే చట్టాన్ని తెచ్చారు. ఇది నిజానికి ముస్లింల పాలనలో ముస్లింలుగా మారిన క్రైస్తవులకు వర్తించింది. ఈ చట్టం పుణ్యమాని 90 శాతం ముస్లింలు క్రైస్తవులుగా మారారు. మిగిలిన వారు స్పెయిన్‌ను విడిచి వెళ్లిపోయారు. ఇక స్పెయిన్‌లోని మసీదులన్నింటిని కూల్చివేసి, చర్చిలుగా పునరుద్ధరించారు. మరి అయోధ్య రామజన్మభూమిలో జరిగింది పూర్తి విరుద్ధం.
సోమనాధ దేవాలయాన్ని నాలుగు సార్లు ధ్వంసం చేశారు. అనేకసార్లు పునరుద్ధరణ జరిగింది. సోమనాధ దేవాలయం మొట్టమొదటిసారి విధ్వంసానికి గురైంది 1026లో. మహమ్మద్ ఘజనీ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దేవాలయాన్ని గుజార దేశ రాజు కుమార పాల 1169లో మళ్లీ నిర్మించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ జనరల్ అయిన ఉలూఫ్ ఖాన్ రెండోసారి ఈ దేవాలయాన్ని మళ్లీ ధ్వంసం చేశాడు. 1325-1351 మధ్యకాలంలో జునాగఢ్ రాజైన ఛుదాసమ దీన్ని మళ్లీ పునరుద్ధరించాడు. ఇక మూడోసారి ఈ దేవాలయాన్ని 1469లో గుజరాత్ సుల్తాన్ మహమ్మద్ బెగ్డా ధ్వంసం చేశాడు. తర్వాత హిందువులు ఈ ఆలయాన్ని మళ్లీ నిర్మించి, శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక నాలుగోసారి 1706లో ఔరంగజేబు ఆదేశాలతో ఈ ఆలయాన్ని మసీదుగా మార్చేందు నిమి త్తం ధ్వంసం చేశారు. తర్వాతి కాలంలో ఈ ప్రాంతం మరాఠా రాజుల పాలన కిందికి వెళ్లింది. తర్వాత అహల్యాబాయి వినియోగించడానికి వీల్లేని స్థితిలో ఉన్న ఈ నిర్మాణానికి కొద్ది దూరంలో మళ్లీ శివాలయాన్ని నిర్మించింది.
1947లో జునాగఢ్ నవాబు పాకిస్తాన్‌లో కలవాలనుకున్నాడు.అందుకు వ్యతిరేకంగా ప్రజాందోళన మొదలైంది. సంఘర్షణలు తీవ్రం కావడంతో, పాకిస్తాన్‌కు పారిపోయాడు. జునాగఢ్ భారత్‌లో విలీనమైంది. సర్దార్ పటేల్, కె.ఎం.మున్షి సౌరాష్టన్రు సందర్శించారు. సోమనాధ దేవాలయాన్ని భారత ప్రభుత్వం నిర్మించాలని నిర్ణయించింది అంటూ ప్రకటించారు. విదేశీ పాలకులనుంచి స్వేచ్ఛను పొందిన దేశ ప్రజలు సగర్వంగా, గౌరవంతో తమ సంస్కృతిని కాపాడుకుంటూ జీవితాలు గడుపుతున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టును వ్యతిరేకించినప్పటికీ, ఖాతరు చేయకుండా సోమనాధ దేవాలయ నిర్మాణం పూర్తిచేశారు. ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు వాడలేదు. కేవలం ప్రజల విరాళాల ద్వారానే నిర్మించారు. శివలింగ ప్రతిష్ఠను అప్పటి రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్ చేశారు. నాటి ఆయన ప్రసంగాన్ని నెహ్రూ ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం కాకుండా అడ్డుకున్నారు.
మరి అప్పట్లో ముస్లింలు సోమనాధ దేవాలయ పునర్నిర్మాణాన్ని ప్రశ్నించే స్థితిలో లేరు. ఎందుకంటే అప్పటికే ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇస్లామిక్ స్టేట్ పాకిస్తాన్‌ను ఏర్పాటైంది. ఆ దేశం నుంచి హిందువులు, సిక్కులు భారత్‌కు పారిపోయి వచ్చారు. మరి అప్పట్లో కమ్యూనిస్టులు, వారికి సంబంధించిన విద్యావేత్తలు ఇంకా పలుకుబడి గల స్థానాలను ఆక్రమించలేదు కనుక ‘‘సెక్యులరిజం ప్రమాదంలో పడింది. ఉమ్మడి సంస్కృతికి భద్రత లేకుం డా పోయింది’’ అని ఎవ్వరూ వాదించలేదు. చరిత్రలో చొరబాటు దార్లు ధ్వంసం చేసిన మూడువేల దేవాలయాల పునరుద్ధరించడం స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న దేశ వాసులకు గౌరవించడమే అవుతుంది. జారిస్టు చక్రవర్తులనుంచి స్వేచ్ఛను పొందిన తర్వాత రష్యన్ ఆర్ధోడాక్స్ చర్చ్‌లను తొలగించి క్యాథలిక్ చర్చిలను నిర్మించారు. స్పెయిన్ దేశంలో మసీదులను మార్చి చర్చిలను నిర్మించారు. చైనా వంటి దేశాల్లో కూడా ఇటువంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రామమందిర నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడమే బాధాకరం.

- త్రిపురనేని హనుమాన్ చౌదరి