రాష్ట్రీయం

బాబు, లోకేష్‌కు మద్యం ముడుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబటి రాంబాబు ఆరోపణ
గుంటూరు, డిసెంబర్ 7: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్, ఎక్సైజ్ శాఖ మంత్రికి నేరుగా ముడుపులు అందుతున్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖపై నియంత్రణ కోల్పోయినందునే కల్తీ మద్యం మరణాల ఘటన చోటుచేసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. సోమవారం ఇక్కడి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, తదితరులతో కలిసి ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. విజయవాడలోని ఒక మద్యం దుకాణంలో ప్రభుత్వ డిపో నుంచి వచ్చిన మద్యం తాగి ఐదుగురు మృతి చెందటం దారుణమన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు. సిఎం చంద్రబాబు విచారణ పేరుతో కాలయాపన చేయనున్నారని విమర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని అంబటి డిమాండ్ చేశారు. మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలోని మద్యం షాపుల్లో మంత్రులు, శాసనసభ్యులు వాటాలు తీసుకుంటూ ఇష్టానుసారం రేట్లు పెంచి అమ్ముకునేందుకు అవకాశం కల్పించారన్నారు. ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలపై నియంత్రణ కోల్పోయి ముడుపులు సేకరించి వారికి అందించటమే పనిగా పెట్టుకోవటం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు.