ప్రకాశం

నదులను అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అన్నా రాంబాబు స్పష్టం
గిద్దలూరు, డిసెంబర్ 27: దేశ చరిత్రలోనే నదులను అనుసంధానం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని గిద్దలూరు టిడిపి ఇన్‌ఛార్జి అన్నా రాంబాబు అన్నారు. ఆదివారం గిద్దలూరు నగర పంచాయతీలోని 2,3,5 వార్డులలో జనచైతన్య యాత్రలు నిర్వహించారు. ఈసందర్భంగా నటరాజ్ థియేటర్ సమీపంలో శ్రీ ఖాదర్‌వలి స్వామి చావిడి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఎప్పటినుంచో దేశప్రజలు అనేకమంది నీటిపారుదల నిపుణుల కలలను నెరవేర్చి దేశ చరిత్రలోనే నదులు అనుసంధానం చేసిన ఘనత సిఎం చంద్రబాబుదేనని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల మేరకు అన్ని సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు సుపరిపాలన అందిస్తూ 16వేల కోట్ల రూపాయల నష్టాల్లో రాష్ట్రం ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల మెప్పుతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మించేందుకు పూనుకున్నారని పేర్కొన్నారు. రైతులను రుణవిముక్తులను చేసిన ఘనత కూడా ఆయనదే అన్నారు.
సిఎం దృష్టికి నీటి సమస్య
గిద్దలూరు పట్టణంలో నీటిఎద్దడి తీవ్రంగా ఉన్న దృష్ట్యా శాశ్వత పరిష్కారం చూపాలని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళామని, త్వరలోనే పూర్తి ప్రతిపాదనలతో ముఖ్యమంత్రిని కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు అన్నా రాంబాబు పేర్కొన్నారు. నగర పంచాయతీ పరిధిలో రేషన్‌కార్డులను 1900మంది లబ్ధిదారులకు త్వరలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. చంద్రబాబుకు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి రెండుకళ్ళుగా భావించి పరిపాలన సాగిస్తున్నారని, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఈసమావేశంలో మాజీ ఎఎంసి చైర్మన్లు తాటిశెట్టి రామ్మోహన్, ఆర్‌డి రామకృష్ణారావు, వైద్యశాల కమిటీ చైర్మన్ కోటా నరసింహులు, మండల టిడిపి అధ్యక్షులు ఎ శ్రీనివాసులు, జన్మభూమి కమిటీ సభ్యులు పి వెంకటరమణ, జిల్లాకార్యవర్గసభ్యులు ఎం శ్రీను, ఎ శేషు, పి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు లుక్ రమేష్, గుర్రమ్మ, టిడిపి సీనియర్ నాయకులు మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, జనచైతన్య యాత్రలో భాగంగా పర్యటించిన టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు 5,2,3 వార్డుల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు.