జనవరి నుంచి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది రామ్‌చరణ్‌కు పెద్దగా అనుకూలించినట్టులేదు. నటించిన రెండు సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో వున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘బ్రూస్‌లీ’ చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఇపుడు తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘తని ఒరువన్’ సినిమా రీమేక్‌లో నటించేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి కిక్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తారు. ఇందులో విలన్ పాత్రకోసం అరవింద్ స్వామితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చిత్రం జనవరి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. మొత్తానికి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే సంకల్పంతో వున్నారు రామ్‌చరణ్, దర్శకుడు సురేందర్‌రెడ్డి.