తెలంగాణ

చెన్నమనేని రమేష్‌కు స్వల్ప ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వం చెల్లదంటూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నాలుగు వారాల పాటు స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది. గతంలో హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోలేదని చెన్నమనేని తరపున న్యాయవాది తన వాదన వినిపించారు. చెన్నమనేని ఏడాది పాటు భారత్‌లో ఉండకుండానే భారత పౌరసత్వం పొందారని ప్రతివాదులు వాదించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ స్టే ఇస్తూ తదుపరి విచారణ డిసెంబర్ 16కి వాయిదా వేసింది.