రంగారెడ్డి

షాద్‌నగర్ డివిజన్‌లో 42504 ఓట్ల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, సెప్టెంబర్ 22: ఓటర్ల జాబితాను సవరణ చేసేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 2014 ఓటర్ల జాబితా ఆధారంగా కేత్రస్థాయిలో ఓటర్ల జాబితాను మండల స్థాయి అధికారులు పరిశీలిస్తున్నారు. బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసి ఒకటికి రెండుసార్లు పర్యవేక్షిస్తున్నారు. నిజమైన ఓటర్లు ఉన్నారా లేదంటే బోగస్ ఓటర్లు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలపై అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన కొనసాగిస్తున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలో 2014 ఓటర్ల జాబితాన ప్రకారం చూస్తే మొత్తం 178571 ఓట్లు ఉండాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం 42504ఓట్లు తొలగిపోయినట్లు రెవెన్యూ అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. కొత్తగా ఎంతమంది ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారనే లెక్కలు తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ 25వ తేది తరువాత ఓటర్ల జాబితాలపై స్పష్టమైన లెక్కలు వచ్చే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 25వ చివరి గడువు విధించడంతో అధికారుల్లో అలజడి మొదలైందని చెప్పవచ్చు.
ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసేందుకు రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు గ్రామాల వైపు పరుగులు తీస్తున్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేనివారు తప్పని సరిగా నమోదు చేసుకోవాలని, సమీపంలో ఉన్న మీ-సేవా కేంద్రాలకు వెళ్లాలని అధికారులు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. గ్రామ పంచాయతీతోపాటు మండల రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకులు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలంటూ ఇటు అధికారులు, అటు రాజకీయ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
బోగస్ ఓట్లతోపాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడమే కాకుండా మరణించిన వారి పేర్లను తీసివేస్తున్నట్లు షాద్‌నగర్ ఆర్‌డీఓ ఎం.కృష్ణ తెలిపారు. స్థానికంగా ఉండి ఓటర్ జాబితాలో పేర్లు లేకుంటే ఫాం నంబర్ 7ను తీసుకొని తిరిగి నమోదు చేసుకోవాలని సూచించారు. అక్టోబర్ 8న తుది జాబితా వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికార యంత్రాంగం పేర్కొంటున్నారు. అప్పుడే ఓటర్ల జాబితాపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.

విద్యార్థులకు సంగీత, నృత్య పోటీలు
వికారాబాద్, సెప్టెంబర్ 22: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు శ్రీవేంకటేశ్వర ఆలయంలో శనివారం పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, బీఈడీ కళాశాలలకు చెందిన విద్యార్థులకు శాస్ర్తియ నృత్యం, శాస్ర్తియ సంగీతం, భగవద్గీత శ్లోకాలు, వేమన పద్యాల పోటీలు నిర్వహించారు. పోటీలలో 25 మంది వర్ధమాన నర్తకీమణులు పాల్గొన్నారు. మిగిలిన అంశాలలో 30 మంది పాలుపంచుకున్నారు. పోటీల విజేతలకు అక్టోబర్ నెలలో ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవ వేడుకలలో సాంస్క్రృతిక కార్యక్రమం సందర్భంగా బహుమతులు అందజేస్తామని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పగడాల లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రథమ బహుమతి రూ.1500, ద్వితీయ బహుమతి రూ.1000, ప్రోత్సాహక బహుమతి రూ.800 ప్రదానం చేస్తామని చెప్పారు. పాటల పోటీలలో ప్రథమ బహుమతి విజేత ధన్నారం స్వామి వివేకానంద గురుకుల పాఠశాల విద్యార్థిని మమత, ద్వితీయ విజేత వెంకటాపూర్ తాండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి వికాస్, వేమన శతక పద్యాల పోటీలో ప్రథమ విజేత సిద్ధార్థ పాఠశాల విద్యార్థిని పీ.శ్రీజ, ద్వితీయ విజేత యూనిక్ పాఠశాల విద్యార్థి కే.పరమేశ్వర్, భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీల ప్రథమ విజేత చైతన్య పాఠశాల విద్యార్థి సాయివంశీ, ద్వితీయ విజేత ఎం.అదిథి, నృత్య పోటీ విజేతలు వైష్ణవి (సిద్ధార్థ), వైష్ణవి (నాగార్జున పాఠశాల), తన్వి(సిద్ధార్థ), దివ్య సాయి (కొత్తగడి, సాంఘిక సంక్షేమ) అని వివరించారు. కళాశాల స్థాయిలో ప్రథమ బహుమతి సిద్ధార్థ కళాశాలకు చెందిన ఎస్.స్నేహ కైవసం చేసుకోగా, రెండో బహుమతి వికారాబాద్ డైట్‌కు చెందిన శ్రావణి కైవసం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 22: గులాబీదళంలో చెలరేగిన అసమ్మతి సెగలు, తిరుగుబాట్లు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సిట్టింగ్‌ల జాబితాపై ఆశావహులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుండగా మరో వైపు తమకు గుర్తింపు లేదంటూ ఉద్యమకారులు తిరుగుబాటు చేస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని 10 మంది కార్పొరేటర్లు ప్రత్యక్ష యుద్ధానికి దిగగా కొత్తగా ఉద్యమకారుల రూపంలో మరో అసమ్మతి వర్గం రోడ్డుకెక్కింది. మాదాపూర్ కార్పొరేటర్ వీ.జగదీశ్వర్ గౌడ్ తిరుగుబాటుతో మొదలైన అసమ్మతి చిలికి చిలికి గాలివానలా తయారై ఉప్పెనలా ఉధృతరూపం దాల్చింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన కొమరగోని శంకర్ గౌడ్‌తో కలిసి టీఆర్‌ఎస్ యూత్ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ కొమాండ్ల శ్రీనివాస రెడ్డి, సీనియర్ నాయకుడు మాచర్ల భద్రయ్య, విజయభాస్కర్ రెడ్డి, ఇబ్రహీం, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ నెల 30వ తేదీన తెలంగాణ ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేసుకుని తమ సత్తా చాటుతామని, శేరిలింగంపల్లి అభ్యర్థిగా ఆరెకపూడి గాంధీని మార్చి తెలంగాణ బిడ్డకు టికెట్ ఇచ్చేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిక జారీ చేశారు.