రంగారెడ్డి

టీఆర్‌ఎస్‌ని తరిమికొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, సెప్టెంబర్ 23: సోనియాగాంధీతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వివరించారు. ఆదివారం షాద్‌నగర్‌లోని కుంట్ల రాంరెడ్డి పంక్షన్ హాల్‌లో లంబాడి గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడితే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పి అమలు చేయకపోవడంతో అంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓబీసీ నుంచి ఎస్టీలుగా గిరిజనులను గుర్తించిన ఘనత ఇందిరాగాంధీదేనని వివరించారు. 2014లో కేసీఆర్ మాయమాటలు చెప్పిడమే కాకుండా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టారని గుర్తుచేశారు.
ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసిన కేసీఆర్‌కు త్వరలో జరగనున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. లంబాడీలు, ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టి ఘర్షణలకు కారణమైన కేసీఆర్‌ను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనపై ప్రజలు ఎంతో ఆగ్రహంతో ఉన్నారని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 72వేల కోట్లు రైతు రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం విడ్డూరంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోపాల్‌నాయక్, విశ్వం, బుజ్జిబాబునాయక్, శివశంకర్ గౌడ్, వై.యాదయ్య, రాజునాయక్, గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.

రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
కాచిగూడ, సెప్టెంబర్ 23: రెళ్ల్లలో పెట్రోలింగ్ చేసేటప్పుడు సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే విభాగమైన చర్యలు ఉంటాయని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జీ.అశోక్ కుమార్, ఆర్‌పీఎఫ్ సీనియర్ సెక్యూరిటీ కమిషనర్ కే.సెంతిల్ అన్నారు. ధైర్యసాహాసాలు ప్రదర్శించే సిబ్బందికి అవార్డుతో పాటు రివార్డులు ఉంటాయని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి రైల్వే స్టేషన్ వద్ద శనివారం సిగ్నల్ ట్యాంరింగ్ చేసి యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బంగారు అభరణాలు, సెల్‌ఫోన్లతో పాటు నగదును ఎత్తుకెళ్లిన సంఘటనతో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ ఉన్నతాధికారులు అప్రమత్తమై సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు చేశారు. ఆదివారం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బందికి రైల్లో విధులను నిర్వహించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రతలు, దొంగలు వస్తే చేపట్టాల్సిన చర్యలు గురించి అవగాహన కల్పించారు.ప్రయాణికుల రక్షణకు ఇబ్బందులు కలిగించడానికి ఎవరైన ప్రయత్నిస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకుని రైల్వే కంట్రోల్ రూమ్‌కు, ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని చెప్పారు. రైళ్లలో చోరీలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ పేర్కోన్నారు. కార్యక్రమంలో రైల్వే అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ సాంబశివ రావు, ఆర్‌పీఎఫ్ కాచిగూడ ఇన్‌స్పెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ పాల్గొన్నారు.