రంగారెడ్డి

తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, అక్టోబర్ 17: తెలంగాణ సంస్కృతికి చారిత్రాక చిహ్నం బతుకమ్మ అని వికారాబాద్ జిల్లా ఎస్పీ టీ.అన్నపూర్ణ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమక్షంలో అధికారిణులు, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా బతుకమ్మ ఆడి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా ఉత్సవం జరపడం సంతోషకరమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ పీ.నర్సింలు, డీఎస్పీ శిరీష, భరోసా సిబ్బంది, ఆర్‌ఐ క్రాంతికుమార్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.
మహిళా పోలీస్ స్టేషన్‌లో..
జిల్లా కేంద్రం రాజీవ్‌గృహకల్ప వద్ద గల మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ బీ.ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవంలో మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు పాల్గొని ఉత్సాహంగా ఆడి పాడారు.
మల్కాజిగిరి: మలాజిగిరిలో బుధవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ వర్షం కురువటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురైనారు. రాత్రి 7గంటల తర్వాత కొంత తగ్గుముఖం పట్టడంతో మహిళలు భక్తి శ్రద్ధలతో తయారు చేసుకున్న బతుకమ్మలను వారి, వారి ఇంటి ఎదుట పెట్టుకోని యువతులు, మహిళలు బతుకమ్మ పాటలకు లయబద్థంగా చప్పట్టు కొట్టుకుంటు ఆడారు. బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు సఫిల్‌గూడ లేక్ పార్కుకు తండోప తండాలుగా తరలి రావటంతో మల్కాజిగిరిలోని అన్ని రోడ్లన్ని మహిళలతో కిక్కిరిసి పోయాయి. సఫిల్‌గూడ లేక్ పార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక నుంచి బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతి ఎంతో గొప్పదన్నారు. సందర్భంగా సఫిల్‌గూడ లేక్ పార్కు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పరిగి, అక్టోబర్ 17: బతుకమ్మ పండుగ ఈరోజు కొత్తగా తీసుకువచ్చిన పండుగ కాదని సృష్టి పుట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగను సాంప్రదాయ బద్ధంగా జరుపుకుంటున్నామని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో బతుకమ్మ ఆడిన సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు పూర్వకాలం నుంచి బతుకమ్మ పండగను జరుపుకుంటున్నారని అన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘమాల, సురేఖ రెడ్డి, రజితా రెడ్డి, ఎంపీపీ రాగ్యాబాయి, మహిళలు పాల్గొన్నారు.
ఉప్పల్: బతుకమ్మ ఆట పాటలతో ఉప్పల్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. సంప్రదాయ దుస్తులు, ఆకర్షణీయమైన తీరొక పూలతో అలంకరించిన బతుకమ్మలు పండుగ శోభను తలపించాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చాటేలా పూల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చిల్కానగర్, ఉప్పల్, హబ్సిగూడ, రామంతాపూర్, శివారు పురపాలక సంఘాలైన బోడుప్పల్, పీర్జాదిగూడలో వాడవాడలా బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. మహిళామణులు ఉత్సాహంగా పాల్గొని ఆట పాటలతో అలరించారు. సర్కిల్ పరిధిలోని నల్గురు మహిళా కార్పొరేటర్లు సరస్వతి, స్వప్న, జ్యోత్స్న, అనలా రెడ్డి మహిళలతో చేరుూ చేరుూ కలిపి బతుకమ్మ ఆట పాటల్లో భాగస్వాములయ్యారు. అనంతరం దాండియా, కోలాటాలతో నృత్యాలు చేస్తూ అందర్ని ఆకట్టుకున్నారు.

బహుమతుల పంపిణీ
బోడుప్పల్ పురపాలక సంఘం కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ ముగింపు సంబురాల్లో విజేతలకు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ బహుమతులను అందజేశారు. అంతకుముందు మహిళలతో కలిసి బతుకమ్మ సంబురాల్లో స్టెప్పులు వేసి ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచారు. మహిళా విభాగం ప్రతినిధులు రాపోలు సువర్ణ, విజయలక్ష్మి, సరిత, కాలనీ సంక్షేమ సంఘం చైర్మన్ రాపోలు రాములు, అధ్యక్షుడు బొమ్మక్ రమేశ్, సలహాదారులు అశోక్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చిత్తరంజన్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం మహిళలు ర్యాలీగా వెళ్లి నీటిలో నిమజ్జనం చేశారు. పోయి రావమ్మ గౌరమ్మా..మళ్లీ రావమ్మా అంటూ పాటలు పాడి ఆనందాన్ని పంచుకున్నారు.
ఘట్‌కేసర్: తెలంగాణ ప్రజల సంస్కృతీ, సాంప్రదాయాలకు అద్దం పట్టే సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు మండలంలో ఘనంగా జరిగాయి. ఘట్‌కేసర్, పోచారం పురపాలక సంఘాలతో పాటు ఏదులాబాద్, చౌదరిగూడ పంచాయతీలలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఘట్‌కేసర్‌లోని చిన్న చెరువు వద్ద సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ వద్ద మహిళలు అనందోత్సహాల మధ్య పాటలు పాడుతూ ఆడారు.
ఏదులాబాద్ మాజీ సర్పంచ్ మూసీ శంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఆకర్షణీయంగా నిలిచింది. అవుషాపూర్ గ్రామంలో బతుకమ్మ ఆడిన మహిళలకు వైయస్‌ఆర్ ట్రస్టు చైర్మన్ ఏనుగు సుదర్శన్‌రెడ్డి చీరలు పంఫిణీ చేశారు. ఎన్‌ఎఫ్‌సీనగర్‌లోని ఆట స్థలంలో నిర్వహించిన బతుకమ్మ పండుగలో పిల్లలు, యువతులు దాండియా, కోలాటం, బతుకమ్మ ఆటలు అందరినీ అలరించాయి. చిన్న చెరువు వద్ద జరిగిన బతుకమ్మ పండుగ వేడుకల్లో మహిళలు పాల్గొన్నారు.
ఆమనగల్లు: ఆమనగల్లు, కడ్తాలలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మను తయారుచేసి ఇంటి ముందు బతుకమ్మ ఆట ఆడి పాడి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో బతుకమ్మలను పేర్చి కోలాటాలు దాండియాలు ఆడారు. ఆమనగల్లు సురసముద్రం చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.