రంగారెడ్డి

శ్రీదుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, అక్టోబర్ 17: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. బుధవారం షాద్‌నగర్ పట్టణంలోని శ్రీకన్యకాపరమేశ్వరీ దేవాలయంలో అమ్మవారు శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు సామూహిక కుంకుమార్చన, ఛండీహోమాలు వంటి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీదుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు రావడంతో కిటకిటలాడిపోయాయి. శివమారుతి గీతా అయ్యప్ప మందిరంలో అమ్మవారు శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. జానంపేట శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారు శ్రీదుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దాంతో భక్తులు సామూహిక కుంకుమార్చన, ఛండీ హోమాలు వంటి పూజ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. షాద్‌నగర్ పురపాలిక సంఘం పరిధిలోని రాఘవేంద్రకాలనీ, భాగ్యనగర్ కాలనీ, కాలేజీ రోడ్డు, ఆర్టీసి కాలనీ, ఫరూఖ్‌నగర్, జీహెచ్‌ఆర్ గార్డెన్‌లో ప్రతిష్ఠించిన అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట శివారులోని శ్రీ్భవాని మాత దేవాలయంలో అమ్మవారు శ్రీదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాయికల్ గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అమ్మవారు శ్రీదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకున్నారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కేశంపేట మండలాల్లోని వివిధ గ్రామాల్లో ప్రతిష్టించిన శ్రీదుర్గామాతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు అయిన బుధవారం దుర్గాదేవికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఛండీహోమాలు, కుంకుమార్చన, పుష్పా అలంకరణ వంటి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

కొందుర్గు: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టించిన అమ్మవారికి గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజలు చేశారు. కొందుర్గు మండల కేంద్రంలోని పంచలింగేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి వీరశైవ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో మహిళలు పాల్గొన్నారు. దేవీ నవరాత్రుల్లో చివరి రోజు బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

తలకొండపల్లి: విజయదశమి పండుగను పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాల్లో కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారు బుధవారం భక్తులకు దుర్గాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. తలకొండపల్లిలో కనకదుర్గ అమ్మవారికి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జడ్‌పీటీసీ నర్సింహ సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో పాండు, సత్తయ్య, గిరిధర్ రెడ్డి, మల్లేష్, శ్రీకాంత్, వెంకటేష్, జంగయ్య పాల్గొన్నారు.

మేడ్చల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగాంగా 8వ రోజు బుధవారం పట్టణంలోని గడిమైసమ్మ అమ్మవారు దుర్గాదేవి అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వినాయక్‌నగర్ కాలనీలో నెలకొల్పిన మండపం వద్ద హోమం, పలుచోట్ల అన్నప్రసాద వితరణ నిర్వహించారు. విజయదశమి ముందు రోజు నిర్వహించే దుర్గాష్టమి పూజలను మండలంలో, మేడ్చల్ మున్సిపల్ పరిధిలో, పారిశ్రామికవాడలో ఘనంగా నిర్వహించారు. వ్యాపార వాణిజ్య సముదాయాలలో పరిశ్రమల్లో, ఆర్టీసీ డిపోలో ఘనంగా ఆయుధ పూజలు నిర్వహించారు. పనిముట్లను, బస్సులను, వాహనాలను అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి సంబరాలు జరుపుకున్నారు. నేడు విజయదశమిని పురస్కరించుకుని మేడ్చల్ మార్కెట్లో కొనుగోలుదార్లతో సందడి నెలకొంది.