రంగారెడ్డి

ఎన్నికల నిర్వహణకు రెండు రకాల ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: హైదరాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పక్కాగా కోడ్‌ను అమలు చేస్తూ, పారదర్శకతతో, ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా రెండు రకాల ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ అంశంపై ఆయన మంగళవారం నోడల్ అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్లతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాన కిషోర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా స్థాయిలో, అలాగే నియోజకవర్గాల వారీగా వేర్వేరుగా ప్రణాళికలను సిద్దం చేయాలని సూచించారు. ఈ రెండు ప్రణాళికలను సంపూర్ణ సమాచారం, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల వివరాలు, పోలీస్ బందోబస్తు, ఎన్నికల నిర్వహణకు కావల్సిన అవసరాలు, పోలింగ్ సిబ్బంది, స్వీప్ కార్యక్రమాల వివరాలు, సమాచార వ్యవస్థ, పోలింగ్ సిబ్బంది భద్రత వంటి అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని రూపొందించాలని ఆదఏశించారు. ప్రధానంగా జిల్లా, నియోజకవర్గ స్థాయి ప్రముఖ అధికారులు, వారి కాంటాక్ట్ నెంబర్లు, బౌగోళిక వ్యవస్థ, శాంతిభద్రతల పరిస్థితుల వివరాలు, జిల్లా, నియోజకవర్గ స్థాయి చిత్రాలు, ఓటర్ల వివరాలు, మహిళా, పురుష ఓటర్ల వివరాలు, ఓటర్ గుర్తింపు కార్డుల కవరేజీ తదితర వివరాలను ఈ ప్రణాళికల్లో క్రోడీకరించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు కావల్సిన పోలింగ్ సిబ్బంది, పోలింగ్ బృందాలు రవాణా ఏర్పాట్లు, పోలింగ్ బృందాలు ప్రయాణించే మార్గాలు, ప్రత్యామ్నాయ మార్గాలను ఈ ప్రణాళికల్లో పొందుపర్చాలని సూచించారు. పోలీసు సిబ్బంది నియామక ప్రణాళిక, ఎన్నికల అనంతరం పోలింగ్ బృందాలు సురక్షితంగా తిరిగి కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఈ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈవీఎంల ఓటింగ్ భద్రతతో పాటు కమ్యూనికేషన్ ప్లాన్ ఏర్పాటు చేయాలని వివరించారు. ఎన్నికల నిర్వహణకు వందలాది మంది పోలింగ్ సిబ్బంది నియమించనున్నట్లు, వారి యోగ క్షేమాలను చూసుకోవల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని ఆయన స్పష్టం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస వౌలిక వసతులను తనిఖీ చేయాలని ఆదేశించారు. నగరంలో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు గాను స్వీప్ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని అధికారులను జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ ఆదేశించారు.

పూలు, పండ్ల ధరలకు రెక్కలు
షాద్‌నగర్ రూరల్, అక్టోబర్ 17: దసరా పండుగ పురస్కరించుకొని పూలు, పండ్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. బుధవారం షాద్‌నగర్ పట్టణంలోని ఏ పూల దుకాణానికి వెళ్లినా పెరిగిన ధరలను చూసి ప్రజలు అవాక్కయ్యారు. దసరా పండుగ గురువారం ఉన్న నేపధ్యంలో బుధవారం పూలు, పండ్లకు ఒక్కసారిగా ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేక వెనుతిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఛామంతి పూలు కిలో రూ.250, తెల్ల ఛామంతి పూలు కిలో రూ.300, గులాబీ పూలు కిలో రూ.450, ఎర్ర బంతి కిలో రూ.50, ఎల్లోబంతి కిలో రూ.70, మిగతా పువ్వులు వందకు పైగానే విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతోనే పూలు, పండ్లకు ఒక్కసారిగా ధరలు పెరిగాయని ప్రజలు భావిస్తున్నారు. స్థానికంగా ఉన్న పూల వ్యాపారులు హైదరాబాద్‌కు వెళ్లి కొనుగోలు చేయడమే కాకుండా స్థానికంగా ఉన్న కొన్ని పూల తోటలను ఖరీదు చేస్తున్నారు. దాంతో పూల ధరలకు ఒక్కసారిగా రెక్కలోచ్చాయని చెప్పవచ్చు. ఆపిల్ ఒకటి రూ.45 నుంచి రూ.55 వరకు విక్రయించడమే కాకుండా అరటి పండ్లు డజన్ రూ.45 నుంచి రూ.55 విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలను నియంత్రించేందుకు అధికారు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

పండుగకు భారీగా పూలు
మెహిదీపట్నం: సద్దుల బతుకమ్మ, దసరా పండుగ పురస్కరించుకుని గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌లో భారీగా పూల విక్రయాలు కొనసాగాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన పలు ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాలనుంచి భారీగా వివిధ రకాల పూలు మార్కెట్‌కు తరలివచ్చాయని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దర్మనగారి వెంకట్ రెడ్డి తెలిపారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పండుగకు అన్ని ప్రాంతాల నుంచి సుమారు 200 లారీలపైనే వివిధ రకాల పూలు వచ్చాయని తెలిపారు. గుడిమల్కాపూర్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని ముందస్తుగానే టప్పాచబుత్ర, ఆసీఫ్‌నగర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులకు తెలియజేశామని తెలిపారు. మార్కెట్‌లో పూర్తిస్థాయిలో ఎంతో సహకరించారని తెలిపారు.