రంగారెడ్డి

ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 16: ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తేవడమే లక్ష్యంగా కష్టపడుతానని వెయిట్‌లిఫ్టర్ తేజావత్ సుకన్య నాయక్ పేర్కొన్నారు. ఇటీవల ఈనెల 10 నుంచి 13వరకు స్పెయిన్‌లోని తేనెరీఫ్‌లో జరిగిన 15వ అంతర్జాతీయ మహిళల వెయిట్‌లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్‌లో 90 కేజీల విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. తేనెరీఫ్‌లో జరిగిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ మహిళల వెయిట్ లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్‌లో స్నాచ్‌లో 75 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 85 కేజీలు మొత్తం కలిపి 160 కేజీలు బరువు ఎత్తి ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. 23 ఎళ్ల తేజావత్ సుకన్య మహబూబాబాద్ జిల్లా జాగ్యా తాండలోలక్ష్మణ్, బద్రికి సంతానంగా జన్మించింది. ముగ్గురు ఆడపిల్లలు కావడంతో తల్లిదండ్రులు ఇంట్లో అందరికన్న చిన్నదైన సుకన్యను నచ్చిన క్రీడలో తల్లిదండ్రులు ప్రోత్సహించారు. 2014లో వెయిట్ లిఫ్టింగ్‌లో చేరిన జిల్లా స్థాయి పోటీలో రాణించి పతకం సాధించడంతో ఉత్సాహం రెట్టింపు అయింది. మాసాబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లోమాను అభ్యసించి, ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణిత సాధించింది. గత సంవత్సరం నిర్వహించిన 14వ అంతర్జాతీయ మహిళల వెయిట్‌లిఫ్టింగ్ గ్రాండ్ ప్రిక్స్‌లో ఆరవ స్థానంలో నిలిచి అనునిత్యం శిక్షణపై దృష్టి సారించడంతో ఈసారి నిర్వహించిన గ్రాండ్ ప్రిక్స్ పోటీలో రెండో స్థానంలో నిలిచింది. తనను ఎల్లపుడు ప్రోత్సహించే తల్లిదండ్రులు, తాత తేజావత్ రామచంద్రు నాయక్, సీబీఆర్ ప్రసాద్, కోచ్ వీఎన్ రాజశేఖర్ ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయి పోటీలో రాణిస్తున్నట్లు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సుకన్య వెల్లడించారు. తనకు ఎవ్వరైన స్పాన్సర్ ముందుకు వచ్చి ప్రోత్సహిస్తే తప్పకుండా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం ఖయామని తెలిపారు. సెప్టెంబర్ మాసంలో పోలాండ్‌లో జరుగనున్న సీనియర్ వరల్డ్ యూనివర్సిటీ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలో పాల్గొనేందుకు శిక్షణలో నిమగ్నమైన సుకన్య భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య నిర్వహించనున్న భారత జట్టు ఎంపిక పోటీలో పాల్గొంటుంది. సీబీఆర్ అకాడమీ వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ రాజశేఖర్ మాట్లాడుతూ సుకన్యకు వెయిట్‌లిఫ్టింగ్‌లో మంచి భవిష్యత్తుందని, త్వరలో జరుగనున్న యూనివర్సిటీ మహిళల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌ప్‌తో పాటు, ఒలింపిక్స్‌లో పతకం సాధించడం ఖాయమని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించి తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతిష్టలు తేవడం ఖయామని అన్నారు. 2014లో లాల్‌బహదూర్ స్టేడియంలో కోచ్‌గా పనిచేసి ప్రస్తుతం సీబీఆర్ అకాడమీలో కోచ్‌గా పనిచేస్తున్నారు. సీబీఆర్ అకాడమీ విజయవాడతో పాటు నగర శివారులోని శంషాబాద్‌లో ఉంది.

మేడ్చల్‌లో కార్డన్ సెర్చ్
మేడ్చల్, మే 16: సైబరాబాద్ కమిషనరేట్ బాలానగర్ జోన్ పరిధిలో మేడ్చల్‌లోని పలు కాలనీల్లో బుధవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణంలోని కిందిబస్తీ, ఏకలవ్యనగర్, వెంకట్రామిరెడ్డి నగర్, వీకర్‌సెక్షన్‌లలో బాలానగర్ జోన్ డీసీపీ సాయిశేఖర్ ఆధ్వర్యంలో ఏసీపీ, ఏడుగురు సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, 94 మంది సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం తెల్లవారు ఝామున 4-30 గంటల ప్రాంతంలో కిందిబస్తీ, ఏకలవ్యనగర్, వెంకట్రామిరెడ్డి నగర్, వీకర్‌సెక్షన్ కాలనీలలోని ప్రతీ ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన వాహన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానితులను ప్రశ్నించారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిట్లు డీసీపీ సాయిశేఖర్ పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్ చేపడుతున్నట్లు వివరించారు. మేడ్చల్ పట్టణంలోని వివిధ కాలనీల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్డన్ సెర్చ్‌లో పత్రాలు సరిగాలేని నాలుగు ఆటోలు, 48 ద్విచక్రవాహనాలు, ఒక కారు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఓ బెల్టుషాపుపై కూడా దాడిచేసినట్లు తెలిపారు. ఐదుగురు అనుమానితులకు అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.