రంగారెడ్డి

బంగ్లా దేశీయులఅక్రమ చొరబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం,మే 16: అక్రమంగా సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించి తప్పుడు సమాచారంతో ఆధార్, ఓటర్, పాన్ కార్డులను పొందిన అక్రమ చొరబాటు దారులను బాలాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర్ రావు తెలిపిన వివరాల ర్రకారం.. బంగ్లాదేశ్ కల్నా రాష్ట్రం, జైషార్ జిల్లా, స్నేహారా మండలం, షికార్ పూర్ గ్రామానికి చెందిన మాసూమ్ బిల్లా (30) మహ్మద్ యూసూప్ (25) ఇదే ప్రాంతానికి చెందిన మహ్మద్ బాబు(20)లు తమ దేశంలో తగినంత ఆదాయ వనరులు లేక పోవడంతో భారత్‌లోకి చొరబడాలని పథకం వేసుకున్నారు. అస్సాం రాష్ట్ర సరిహద్దుల నుండి అక్రమంగా భారత్‌లో ప్రవేశించారు. నగరానికి చేరుకుని బాలాపూర్ పీఎస్ పరిధిలోని బాలాపూర్ మండల జల్‌పల్లి గ్రామంలో ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలోని ఖురేషి కోల్డ్ స్టోరేజీలో నెల వారి జీతంతో పని చేస్తున్నారు. మహ్మద్ యూసూప్ తప్పుడు సమాచారం అందించి ఆధార్, ఓటర్, పాన్ కార్డులను అక్రమంగా పొందాడు. అక్రమంగా పొందిన కార్డుల సహాయంతో మిగుల్చుకున్న జీతం మొత్తాన్ని బంగ్లాదేశ్‌లో ఉంటున్న తమ కుటుంబ సభ్యులకు పంపిస్తున్నాడు. అక్రమ చొరబాటు దారుల విషయాన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్న బాలాపూర్ పోలీసులు మంగళవారం రాత్రి ఇంటిపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పూర్తి వివరాలను వెల్లడించారు. మేరకు వారి వద్ద ఉన్న నకిలి కార్డులను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ పాల్గొన్నారు.