రంగారెడ్డి

ఇంటర్ జోనల్ స్పోర్ట్స్ క్విజ్ విజేత రోలార్ స్కేటింగ్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 19: గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాల సందర్భంగా చిన్నారుల్లో క్రీడా మేదాస్సు పెంపోందాలన్న ఉద్ధేశ్యంలో జోన్‌ల వారీగా స్పోర్ట్స్ క్విజ్ పోటీలను నిర్వహించింది. జోన్‌ల వారీగా నిర్వహించిన పోటీలో గెలుపొందిన మొదటి రెండు స్థానంలో నిలిచిన ఇద్దరితో కూడిన జట్లు కలిగిన అన్ని జోన్‌లను కలిపి నిర్వహించే ఇంటర్ జోనల్ పోటీల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన ఇంటర్ జోనల్ క్విజ్ పోటీల్లో ఇందీరా పార్క్ రోలార్ జట్టుకు చెందిన ఆరీబ్ ముజ్‌తాబా సిద్ధిఖీ, వైవీ.హరినాథ్‌ల జోడీ విజేతగా నిలిచింది. విక్టరి ప్లేగ్రౌండ్‌లో శనివారం జరిగిన ఈ పోటీల్లో జంటనగరాల్లోని అన్ని జోన్లకు చెందిన జట్లు పాల్గొన్నాయి. లింగంపల్లి చంధానగర్‌లోని పీజేఆర్ స్టేడియంకు చెందిన బాస్కెట్‌బాల్ క్రీడాకారులైన టీ.హేమంత్, జీ.రేఖాంత్, లాలాపేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు భానుప్రసాద్, ఆక్షిత్ సాయిల జోడి ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచాయి. అనంతరం జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ సేవఏస్ల్వాత్ విచ్చేసి గెలుపొందిన జట్లకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మమత గుప్తా, స్పోర్ట్స్ విభాగం ఓస్‌డీ ఎస్‌ఆర్.ప్రేమ్‌రాజ్, అదనపు స్పోర్ట్స్ డైరెక్టర్ జీ.ఉమేష్, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

కిదాంబి శ్రీకాంత్‌ను సత్కరించిన శాట్స్ ఎండీ
హైదరాబాద్, మే 19: ప్రపంచ నెంబర్ వన్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌ను శనివార ఘనంగా సత్కరించారు. లాల్‌బహదూర్ స్టేడియంలోని శాట్స్ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో వీసీ, ఎండీ ఎ.దినకర్‌బాబు భారత స్టార్ షట్లర్ శ్రీకాంత్‌ను శాలువాతో సత్కరించి మేమోంటోను అందజేశారు. సుమన్ పల్లే, కిరన్ పాల్గొన్నారు.

రంజాన్ సందర్భంగా శాంతి సమావేశాలు
వికారాబాద్, మే 19: ముస్లింల పవిత్రమాసం రంజాన్ ఉన్నందున పీస్ కమిటీ మీటింగ్‌లను నిర్వహించాలని జిల్లా ఎస్పీ టీ.అన్నపూర్ణ ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో కేసుల పరిష్కారంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నందున శాంతి భద్రతలకు సంబంధించిన సమాచారం సేకరించాలని, గత ఎన్నికల్లో లోపాలు రాబోయే ఎన్నికల్లో పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. విత్తనాలు, ఎరువుల దుకాణాలపై దాడులు చేసి నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు కొన్ని కేసులను సిబ్బందికి అప్పగించాలని, దానివల్ల సిబ్బందిలో నాయకత్వ లక్షణాలు అలవడతాయని పేర్కొన్నారు. కేసుల్లో శిక్ష పడేందుకు టెక్నికల్ ఎవిడెన్స్‌లను తప్పనిసరిగా తీసుకురావాలని అన్నారు. పోలీసు అధికారులు 5ఎస్ పద్ధతిని తప్పకుండా పోలీస్‌స్టేషన్‌లు, ఆఫీసులతో అవలంబించాలని వివరించారు. రైతుబంధులో ఎలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టిన సిబ్బంది, అధికారులను అభినందించారు. జిల్లా అదనపు ఎస్పీ పరమా ల నర్సింలు, వికారాబాద్, తాండూర్, పరిగి డీఎస్పీలు శిరీష, రామచంద్రుడు, శ్రీనివాస్, సీఐ, ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు.