రంగారెడ్డి

పంచాయతీ ఉద్యోగుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, మే 23: న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ఆర్డీవో కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం ఎనిమిదో రోజుకు చేరాయి. అయినా ప్రభుత్వం స్పందించనందుకు నిరసనగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షుడు, పంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు బీ.కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉందని, త్వరలోనే గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలపై పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గురువారం చర్చలు జరపనున్నట్లు చెప్పారు. సంఘం అధ్యక్షుడు బాల్‌రాజ్, ప్రధాన కార్యదర్శి బోనయ్య, టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా కార్యదర్శి అనంతయ్య పాల్గొన్నారు.
పోలింగ్ బూత్‌ల పరిశీలన
షాబాద్, మే 23: మండలంలో కొత్తగా ఏర్పడిన పోలింగ్ బూత్‌లను ఎంపీడీవో పద్మావతి పరిశీలించారు. బుధవారం మండల పరిధిలోని పోలారం, నరేడ్లగూడ, లక్ష్మణరావుగూడ, గ్రామాలను సందర్శించి పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో పోలింగ్ జరిగేవిధంగా ఉన్నాయా లేవా అనే విషయాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పాఠశాల గదులు వాటి వివరాలు వౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాలను సందర్శంచి వాటి వివరాలు ఉన్నత అధికారులకు పంపిస్తామని అన్నారు.
‘జర్నలిస్టుల గర్జన’ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
బాలాపూర్, మే 23: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న తలపెట్టిన ‘జర్నలిస్టుల గర్జన’ను విజయవంతం చేయాలని రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కొత్తపేట్ బీజేఆర్ భవన్‌లో ‘జర్నలిస్టుల గర్జన’ వాల్‌పోస్టర్‌ను శ్రీకాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 28న నగరంలోని ఆర్‌టీసీ కల్యాణ మండపంలో నిర్వహించనున్న జర్నలిస్టుల గర్జనలో ప్రతి జర్నలిస్టు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రవీణ్, శ్యామ్, సుభాష్, ఆంజనేయులు, పాల్గొన్నారు.
మున్సిపాలిటీకి నిధులు ఇవ్వాలి
వికారాబాద్, మే 23: వికారాబాద్ పురపాలక సంఘం అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని వికారాబాద్ శాసనసభ్యుడు బీ.సంజీవ రావు బుధవారం పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావును కలిసి కోరారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ నాయకుడు శుభప్రద్ పటేల్ ఉన్నారు.

మహానాడుకు తరలి రావాలి
* సామ రంగారెడ్డి పిలుపు
వనస్థలిపురం, మే 23: ఈనెల 24న నిర్వహించనున్న తెలంగాణ మహానాడుకు రంగారెడ్డి జిల్లా నుండి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం ఎల్బీనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య నాయకుల సమావేశంలో రంగారెడ్డి మాట్లాడుతూ పార్టీ వ్యావస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ టీడీపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్పారు. మహానాడుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్ర