రంగారెడ్డి

దళితుల సమస్యల పరిష్కారానికే ఎస్సీ, ఎస్టీ కమిషన్: ఎర్రోళ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 20: ఎస్సీ, ఎస్టీలపై జరిగే అత్యాచారాలు, వారి సామాజిక సమస్యలు, భూ సంబంధ వివాదాలు, దళిత ఉద్యోగుల సమస్యలపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఉమర్ జలీల్ అధ్యక్షతన జిల్లా నిఘా వ్యవహారాలు, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మూడు నెలలకోసారి జిల్లా నిఘా వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించాలని, సమావేశానికి ప్రజాప్రతినిధులు, కమిటీ సభ్యులను ఆహ్వానించాలని అన్నారు. ప్రతి నెల 30వ తేదీన జిల్లా, డివిజన్, మండల, గ్రామాల్లో పౌర హక్కుల సమావేశం నిర్వహించి వాటి నివేదికను కలెక్టర్ ఆమోదంతో కమిషన్‌కు పంపాలని కోరారు. సంక్షేమ పథకాల అమలుపై ఎస్సీ, ఎస్టీలందరికి అవగాహన కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. కమిషన్‌కు సివిల్ కోర్టుకుండే న్యాయ అధికారాలుంటాయని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడులు, దౌర్జన్యాలపై స్పందించి సమావేశాల ద్వారా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే దాడులను అరికట్టవచ్చని, పోలీసు అధికారులు దళితులకు భరోసా ఇచ్చినట్టయితే ఆత్మగౌరవంతో జీవిస్తారని వివరించారు. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని, డీవీఎంసీ సమావేశాలను ప్రతి మూడు నెలలకోసారి నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందజేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితులకు అందించే నష్టపరిహారాన్ని త్వరగా అందజేస్తామని పేర్కొన్నారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న కేసులను సైతం పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో వికారాబాద్, పరిగి శాసన సభ్యుడు బీ.సంజీవ రావు, టీ.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులలో భూ తగాదాలే ఉన్నాయని, వాటిని పోలీసు, రెవెన్యూ యంత్రాంగం సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు బోయిళ్ల విద్యాసాగర్, రంబల్ నాయక్, సంకపాక దేవయ్య, చిలకమర్రి నరసింహ, జిల్లా ఎస్పీ టీ.అన్నపూర్ణ, జేసీ అరుణ కుమారి, జిల్లా దళిత సంఘాల నాయకుడు, డీవీఎంసీ సభ్యుడు పెండ్యాల అనంతయ్య, శివరాజ్, రాఘవన్ నాయక్, రాములు, జిల్లా సంక్షేమ అధికారి కోటాజి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మోజస్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి విజయలక్ష్మి, ఆర్‌డీవోలు విశ్వనాథం, వేణు మాధవరావు పాల్గొన్నారు.

ఉద్యోగ శిక్షణ భేష్
వికారాబాద్, జూన్ 20: జిల్లా కలెక్టర్, ఎస్పీల చొరవతో పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో శిక్షణ పొందిన 1200 మంది ఉద్యోగం సాధిస్తారనే విశ్వాసం ఉందని శాసనసభ్యుడు బీ.సంజీవ రావు అన్నారు. బుధవారం స్థానిక మేరీ ఎ నాట్స్ పాఠశాలలో పోలీసు కానిస్టేబుల్ పోటీ పరీక్షల అభ్యర్థుల ఉచిత శిక్షణ తరగతుల ముగింపు, అభ్యర్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణ పొందిన అభ్యర్థులను చూస్తే వెనుకబడిన వికారాబాద్ జిల్లా ముందడుగు వేస్తున్న భావన కలుగుతోందని చెప్పారు. కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ జిల్లాలోని అభ్యర్థుల శిక్షణకు ప్రభుత్వం 25 లక్షల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. 18 వేల ఉద్యోగాలు ఉన్నందున జిల్లాలో శిక్షణ పొందిన వారందరు ఉద్యోగం సాధించాలని సూచించారు. ఎస్పీ టీ.అన్నపూర్ణ మాట్లాడుతూ ఎప్పటికపుడు శిక్షణ పొందుతున్న అభ్యర్థుల భోజనం, వసతి, ఏర్పాట్లపై కలెక్టర్ వాకబు చేయడంతో మరింత ఆసక్తి పెరిగిందని చెప్పారు. శిక్షణ విజయవంతం కావాలని ప్రయత్నించామని పేర్కొన్నారు. ఆర్మీ ర్యాలీకి వెళ్లేందుకు జిల్లా కలెక్టర్ బస్ ఏర్పాటు చేశారని, క్విజ్ కాంపిటీషన్‌కు సీఐలు ఉపేందర్, వెంకట రామయ్య కృషి చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కే.అరుణ కుమారి, జిల్లా అదనపు ఎస్పీ పీ.నర్సింలు, డీఎస్పీ శిరీష, ఫ్యాకల్టీ భాగ్యకిరణ్, శిక్షణ ఇన్‌చార్జిలు ఎస్‌బీఐ వెంకటేశ్వర్లు, రవికుమార్, వికారాబాద్, ధారూర్ సీఐలు ఎం.వెంకటరామయ్య, జే.ఉపేందర్, డీసీఆర్‌బీ సీఐ దాసు, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.