రంగారెడ్డి

కేటీఆర్ సుడిగాలి పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: మహానగరంలో మున్సిపల్ మంత్రి కే. తారకరామారావు బుధవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఉదయం అమీర్‌పేట మెట్రోరైలు స్టేషన్‌లో పనులను తనిఖీ చేసిన మంత్రి అక్కడి నుంచి మెట్రోరైలు ట్రయల్ రన్‌లో ఎల్‌బీనగర్ వరకు ప్రయాణించారు. అక్కడ మెట్రోరైలు ప్రాజెక్టు వివరాలు, రెండో కారిడార్ ప్రారంభం విషయాలను వెల్లడించిన మంత్రి అక్కడి నుంచి పాతబస్తీలోని కిషన్‌బాగ్ ప్రాంతంలో జీహెచ్‌ఎంసీ రూ.6.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన పార్కును మంత్రి కేటీఆర్ పార్లమెంటు సభ్యులు అసదుద్దిన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు వౌజంఖాన్, పాషాఖాద్రి, మున్సిపల్ కార్యదర్శి అర్వింద్‌కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ డా.బి.జనార్దన్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ పార్కు ప్రారంభోత్సవంతో పాతబస్తీ వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు మరో పార్కు అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత శాలిబండ సిగ్నల్ నుంచి ముసాబౌలీ జంక్షన్, సిటీ కాలేజీ జంక్షన్ నుంచి పురానాపూల్ వరకు నిర్మించనున్న బీటీ ర్డో రీ కార్పెటింగ్ పనులను మంత్రి పురానాపూల్ వద్ద ప్రారంభించారు. క్రంబ్ రబ్బర్ బిటుమిన్ సాంకేతిక పరిజ్ఞానంతో 3వేల 70 మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ రోడ్డు నిర్మాణం పూర్తయి, ప్రజలకు అందుబాటులోకి వస్తే పాతబస్తీ నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు సౌకర్యం మెరగుపడుతోంది. అనంతరం రూ. 69 కోట్ల వ్యయంతో ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న బహద్దూర్‌పురా ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 682 మీటర్ల పొడువు, ఆరు లేన్ల వెడల్పుతో నిర్మించే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల పురానాపూల్ నుంచి జూపార్కు వెళ్లే దారిలో 90 శాతం మేరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతోందని అధికారులు వెల్లడించారు. వచ్చే సంవత్సరం చివరి కల్లా పూరికానున్న ఈ ఫ్లై ఓవర్‌తో 2034 సంవత్సరం వరకు ట్రాఫిక్ పెరిగే ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నారు.
‘మెట్రో’లో పాస్‌లు ‘లేనట్టే’నా?
మహానగరంలో మెట్రోరైలు, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులన్నింటికి కలిపి ఒకే పాస్ అందుబాటులోకి ఎపుడు వస్తుందోనని ఎదురుచూసిన నగరవాసుల కల కల్ల అయ్యింది. ఈ మూడు రవాణా సేవలను అనుసంధానం చేస్తూ, సామాన్యులు భరించే స్థాయిలో పాస్ ధరను నిర్ణయించి, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని గత సంవత్సరం నవంబర్ మాసంలో మియాపూర్, అమీర్‌పేట కారిడార్ ప్రారంభంలో మంత్రి తారక రామారావు వెల్లడించారు.
తాజాగా బుధవారం ఎల్‌బీనగర్ మెట్రో స్టేషన్‌లో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఓ ప్రశ్నకు స్పందిస్తూ మెట్రోరైలులో పాస్ జారీ చేసే అవకాశం లేదని, ఇది ఆర్థికపరమైన వ్యవహారమని మంత్రి తేల్చి చెప్పటంతో ఇప్పటి వరకు మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీలను కలిపి జారీ చేయనున్న వన్ ఇన్ త్రీ పాస్ కోసం ఎదురుచూసిన ప్రయాణికులు ఒకింత అసంతృప్తికి గురయ్యారు.

దరఖాస్తులను పరిష్కరించాలి
హైదరాబాద్, జూన్ 20: పెండింగ్ దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి పరిష్కరించి, వాటి వివరాలను ఆన్‌లైన్ ద్వారా అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ యోగితా రాణా మీ-సేవ నిర్వాహకులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఓసీల జారీని కూడా వేగవంతం చేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో జేసీ శ్రీవత్స కోటాతో కలిసి 58,59 జీవో ల్యాండ్ బ్యాంక్, రికార్డు రూపంలో భద్రత, మీ-సేవలో పెండింగ్ దరఖాస్తులు, పెండింగ్ దరఖాస్తులు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పెండింగ్ కోర్టు కేసులు వంటి అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ రాణా మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఎన్‌ఓసీలను పరిశీలించి అర్హత మేరకు జారీ చేయాలని ఆదేశించారు. వివిధ సెక్షన్లలో చర్య పూర్తి అయిన ఫైళ్లను గుర్తించి, క్లోజ్ చేసి రికార్డు రూపంలో భద్రపర్చాలని అన్నారు. జీవో నెం. 58 కింద రెగ్యులరైజే చేసిన, తిరస్కరించిన దరఖ్తాల వివరాల నివేదకను పంపాలని పేర్కొన్నారు. కొత్తగా గుర్తించిన ల్యాండ్ పార్శిళ్లను ల్యాండ్ బ్యాంకుల్లో జమ చేయటానికి తగిన చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశించారు. ఖాళీ స్థలాలను గుర్తించి, వాటి ఫొటోగ్రాఫ్‌లను ల్యాండ్ పార్శిళ్లను బ్యాంక్‌లో అప్‌లోడ్ చేయాలని అన్నారు. జీవో 59 కింద రెగ్యులరైజేషన్ చెల్లించే పెండింగ్ మొత్తాలను వీఆర్‌ఓలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దరఖాస్తుదారులు చెల్లించేలా చూడాలని ఆదేశించారు. భూ వివాదంలో ఉన్న స్థలాలను స్వయంగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని తహశీల్దార్లను ఆదేశించారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి దరఖాస్తులను అర్హత మేరకు పరిశీలించి పరిష్కరించాలని పేర్కొన్నారు. వీఆర్‌ఓలు తమ పరిధిలోని సంక్షేమ గృహాలను తనిఖీ చేసి నివేదికలందించాలని సూచించారు. సంక్షేమ వసతి గృహంలో తప్పనిసరిగా ప్రతిరోజు మెనూ డిస్‌ప్లే చేయాలని అన్నారు. అధిక శాతం కోర్టు కేసులను పరిష్కరించటానికి చర్యలు తీసుకున్న తహశీల్దార్లను కలెక్టర్ అభినందించారు. ఇన్‌చార్జి డీఆర్‌ఓ రాధికరమణి, ఆర్డీఓ చంద్రకళ, ఎన్‌ఐసీ అధికారి భద్రయ్య పాల్గొన్నారు.