రంగారెడ్డి

వచ్చే నెలాఖరులో అమీర్‌పేట-ఎల్‌బీనగర్ మెట్రో పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఉప్పల్, జూన్ 20: నిత్యం రద్దీగా ఉండే ఎల్‌బీనగర్ - అమీర్‌పేట ప్రాంతాల మధ్య వచ్చే నెలాఖరులో మెట్రో రైలు పరుగులు తీయనున్నట్లు, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు స్పష్టం చేశారు. రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను రవాణా శాఖ మంత్రి పీ.మహేందర్ రెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. తొలుత అమీర్‌పేట మెట్రోరైలు స్టేషన్‌లో పనులను తనిఖీ చేసిన మంత్రి, ఆ తర్వాత అమీర్‌పేట్ నుంచి ఎల్‌బీనగర్ వరకు మెట్రో ట్రయల్ రన్‌లో ప్రయాణించారు. అనంతరం ఎల్‌బీనగర్ మెట్రో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో 40 శాతానికి పైగా ప్రైవేటు వాహనాలు వాడటంతో ట్రాఫిక్, కాలుష్యం సమస్య పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేశామని అన్నారు.
తొలి దశలో నాగోల్- అమీర్‌పేట - మియాపూర్ కారిడార్ ప్రారంభంతో ట్రాఫిక్ ఇబ్బందులు కొంత మేరకు తగ్గాయని వివరించారు. మెట్రోలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని, నిత్యం 80వేల మందికిపైగా ప్రయాణం చేస్తున్నట్లు పేర్కొన్నారు. చెన్నై, బెంగళూర్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ మెట్రోకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని, ఇంత భారీ ప్రాజెక్టును పీపీపీ ప్రాతిపదికన ప్రపంచంలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేశామని, దేశంలోని అన్ని మెట్రో కంటే ఇది భిన్నమైందని వివరించారు. మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. మియాపూర్ డిపో వద్ద చేసినట్లుగానే ఎల్‌బీనగర్ ప్రాంతంలో అభివృద్ధి చేస్తామని, హైటెక్ సిటీ మాదాపూర్ మార్గాన్ని అక్టోబర్‌లో పూర్తిచేస్తామని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వౌలిక సదుపాయాలను కల్పించేందుకు 42 చోట్ల మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్సులను నిర్మించనున్నట్లు తెలిపారు. నిత్యం ప్రయాణికులతో రద్దీ ఉండే నాంపల్లి, ఎంజీబీఎస్ స్టేషన్ల మధ్య మెట్రోను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. కనెక్టివిటీ లేకపోవటంత్లో ఎక్కువ మంది మెట్రోను వినియోగించుకోలేకపోతున్నారనే ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా సెట్విన్ బస్సులను అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే నగరంలో ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను ప్రవేశపెడుతున్నామని, త్వరలోనే 500 బస్సులను కొనుగోలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మియాపూర్ స్టేషన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులను ఆకట్టుకునేవిధంగా పనులు జరుగుతున్నాయని, మూడు మెట్రో మాల్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామని, అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో సేవలను అందించేందుకు ఎల్‌బీనగర్, ఫలక్‌నుమా, శంషాబాద్ కారిడార్ పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. మెట్రోలో పాసుల జారీ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. రవాణా శాఖ మంత్రి పీ.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రవాణా వ్యవస్థను మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మెట్రోస్టేషన్లకు వచ్చే ప్రయాణికులకు అవసరమైన ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని అన్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తూనే కాలనీల వరకు బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ విజయకృష్ణ పాల్గొన్నారు.
బయ్యారం ప్లాంటు ఏర్పాటు చేసి తీరుతాం
బయ్యారం స్టీలు ప్లాంటు ఏర్పాటుకు కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించినా, సహకరించకపోయినా ఆ స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేసి తీరుతామని మంత్రి కేటీఆర్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 10 వేల నుంచి 15 వేల మందికి ఉపాధి కల్పిస్తామని, ఎవరూ దీక్షలు చేయాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.