రంగారెడ్డి

ఇళ్లలో చోరీ చేసే ఘరానా దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 13: ఇంటికి తాళం కనడితేచాలు ఆ ఇల్లు గుల్లయినట్లే... పగలు చూస్తాడు రాత్రి దోచేసేస్తాడు. పలుమార్లు జైలుకు వెళ్లినా మార్పు రాకపోవడంతో పోలీసులు పీడీ యాక్ట్‌కింద నమోదు చేసి సంవత్సరం జైలుకు పంపించినా నిందితుడిలో ఎలాంటి మార్పు రాలేదు. జైలు నుండి విడుదలైన తరువాత కూడా పాత పద్ధతిలో ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తూ కుషాయిగూడ పోలీసులకు చిక్కాడు మహమూద్ మహ్మద్ పాషా అలియాస్ బిరియానీ పాషా. నిందితుడి నుంచి రూ.13లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ మహేష్ భగత్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీపీ మహేష్ భగత్ వివరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం రామ్‌నగర్ కాలనీలో నివాసముడే మహ్మద్ పాషా (36) 2001 నుంచి 2008 వరకు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో 50 దొంగతనాలు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2011లో జైలు నుండి బయటకు వచ్చిన పాషా మూడు కమిషనరేట్‌ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడాడు. 2016లో వనస్థలిపురం పోలీసులు పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు పంపించారు. ఫిబ్రవరి 18న జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు ఐదు నెలల్లో 10 దొంగతనాలు చేసి కుషాయిగూడ పోలీసులకు చిక్కాడు. నిందితుడు రాత్రి సమయంలో ఇంటికి తాళం వేసిన ఇళ్ల్లను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడతాడని సీపీ తెలిపారు. నిందితుడి నుండి రూ.13లక్షల విలువ చేసే 32 తులాల బంగారం ఆభరణాలు, ఏడున్నర కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. బిరియానీ పాషా పేరు ఎలా వచ్చింది అని విలేఖరులు ప్రశ్నించగా, రెండు బిరియానీలు ఒకేసారి తింటాడని వివరించారు. డీసీపీ క్రైం నాగరాజు, ఏసీపీ కృష్ణమూర్తి, కుషాయిగూడ డీఐ రాములును అభినందించారు. డీఐ రాములు బృందానికి నగదు రివార్డును అందజేశారు.

కీసర ఎంపీపీ సుజాతపై అవిశ్వాసం
కీసర, జూలై 13: కీసర మండల పరిషత్ ఎంపీపీ ఆర్.సుజాతపై ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టారు. శుక్రవారం కీసర ఆర్డీఓ లచ్చిరెడ్డికి ఎంపీపీపై అవిశ్వాసం పెడుతున్నట్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసారు. మండలంలో 20 మంది ఎంపీటీసీలకు 16 మంది ఎంపీటీసీలు అవిశ్వాసంపై సంతకాలు చేసారు. వీరంతా టీడీపీ, టీఆర్‌ఎస్‌కి చెందినవారు. టీఆర్‌ఎస్‌కి చెందిన ఎంపీపీపై అదే పార్టీకి చెందిన ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టారు. కాంగ్రెస్‌కి చెందిన ఇద్దరు ఎంపీటీసీల మద్దతు మాత్రమే ఎంపీపీ సుజాతకు ఉండటం గమనార్హం. ఫిర్యాదును స్వీకరించిన ఆర్డీఓ లచ్చిరెడ్డి.. త్వరలోనే అవిశ్వాసంపై సమావేశం ఏర్పాటు చేసి బల నిరూపణకు ఎంపీపీకి సూచిస్తారని తెలిపారు. అనంతరం 16 మంది ఎంపీటీసీలు మినీ బస్‌లో అజ్ఞాత వాసంలోకి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు మల్లేశ్, పెంటయ్య, నవనీత, కవిత, రాధిక, భాస్కర్, లావణ్య, సంగీత, స్వప్న, లిలిత, కవిత, ప్రశాంత్, శ్రీనివాస్, శ్రీహరి పాల్గొన్నారు.

ప్రజా సమస్యలపై సమరం: చాడ
హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సమరం సాగిద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం ముఖ్దూంభవన్‌లో రంగారెడ్డి జిల్లా సమితి సీపీఐ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా చాడా పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం మాటల ప్రభుత్వమని, చేతల ప్రభుత్వం కాదని అన్నారు. జిల్లాలోని స్థానిక సమస్యలను గుర్తించి ఎక్కడికక్కడే సమరశీల పోరాటాలు సాగించాలని సూచించారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మణాలు అటకెక్కాయని ఆరోపించారు. ప్రాణహిత చేవేళ్లతో పాటు రంగారెడ్డి - పాలమూరు ఎత్తిపోతల పథకం కోసం ఉద్యమకార్యచరణ రూపొందించి పోరు సాగించాలని దిశానిర్ధేశం చేశారు.