రంగారెడ్డి

పూజల పేరుతో మోసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూలై 13: పూజలు చేస్తే బంగారం రెట్టింపు అవుతుంది.. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.. మానసిక ప్రశాంతత చేకురుతుంది. సమస్య ఏదైన పూజలు చేసి వాటిని దూరం చేస్తామని శాటిలైట్ ఛానల్స్ ప్రకటనలు గుపించాడు. యజ్ఞం, హోమం, పూజలు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న నకిలీ బాబాను అతనికి సహకరించిన భార్యని బాలనగర్, శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ బాబా నుంచి సుమారు రెండు కేజీల బంగారం ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడి వివరాలను కమిషనర్ సజ్జనార్ వివరించారు. కేరళకు చెందిన శివాహోమ్ రామశివనుజం (37).. 1998లో స్వామీజీగా మారారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, వారణాసి, అమరావతి పదితర ప్రాంతాలను సందర్శించారు. 2009లో స్వామీజీ శివహోమ్ తేజస్విని వివాహం చేసుకుని హైదరాబాద్‌కు మాకాం మార్చి యుసుఫ్‌గూడలో తత్వాపితం ఆశ్రమం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక బోధనలతో ప్రలను ఆకర్శించాడు. పూజలు చేస్తే కోటీశ్వరులు అవుతారని నమ్మించి అనేక మందిని మోసం చేశారు. ఇంద్రా సినిమాలో బ్రహ్మనందం బృందం మాదిరిగా భార్యాభర్తలు వెండి కలశాల్లో బంగారం ఆభరణలు పెట్టి పూజ చేస్తే గడువు తరువాత తామే వచ్చి స్వయంగా తేరిచి తీస్తామని నమ్మించేవారు. పూజ చేయాడానికి కావల్సి రెండు కలశాలను భార్యభర్తలే షాపు నుంచి తీసుకొచ్చేవారు. పూజ చేసిన స్వామి చెప్పిన సమయం పూర్తి కావడంతో కలాశాలను తెరిచి చూస్తే అందులో రాళ్లు, ఇసుక దర్శనం ఇవ్వడంతో మోసపోయామని పోలీసులను బాధితులు ఆశ్రయించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 మంది వరకు తమకు ఫిర్యాదు చేసినట్లు సీపీ తెలిపారు. మరో మారు పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తామని వివరించారు. దొంగ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైన బాధితులు ఉంటే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీపీ చెప్పారు. భార్య తేజస్విని.. బాబా మోసం చేసి తెచ్చిన బంగారాన్ని ప్రైవేటు ఫ్రైనాన్స్ సంస్థలకు, బయట వ్యక్తులకు విక్రయించేదని సీపీ వివరించారు. భార్యాభర్తలను అరెస్టు చేసి వీరి నుంచి సుమారు 1922 గ్రాముల బంగారం, మహేంద్ర ఎక్స్‌యూవీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ పద్మజా రెడ్డి, క్రై ఏడీసీ దయానంద్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ పగడాల అశోక్ పాల్గొన్నారు.

సైబర్ ల్యాబ్ ప్రారంభం
వికారాబాద్, జూలై 13: వికారాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో అన్ని సౌకర్యాలతో కూడిన భరోసా కేంద్రాన్ని, సైబర్ ల్యాబ్, కమాండ్ కంట్రోల్, కాన్ఫరెన్స్ హాల్, షీటీమ్‌లను హైదరాబాద్ రీజియన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర, లాఅండ్‌ఆర్డర్ ఐజీ స్వాతి లక్రా శుక్రవారం ప్రారంభించారు. జిల్లాలో సీసీ కెమెరాల నిర్వహణ గురించి జిల్లా ఎస్పీ టీ.అన్నపూర్ణను అడిగి తెలుసుకుని విధి నిర్వహణ, నేర నియంత్రణలో సీసీ కెమెరాల ఉపయోగం చాలా ఉపయోగపడుతుందని, పట్టణంలోని ప్రవేశం, పట్టణం నుంచి బయటకు వెళ్లే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేర నియంత్రణకు సిబ్బంది తమ వంతు విధులను నిర్వహించాలని స్టీఫెన్ రవీంద్ర సూచించారు. భరోసా కేంద్రాన్ని పరిశీలించి అక్కడి సిబ్బంది పనితీరును, భరోసా కేంద్రానికి వచ్చే కేసుల గురించి వారికి సిబ్బంది కల్పిస్తున్న అవగాహన గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైలరింగ్ శిక్షణను జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు పరమాల నర్సింలు, టీఎస్ రవికుమార్, వికారాబాద్ డీఎస్పీ శిరీష రాఘవేంద్ర పాల్గొన్నారు.

ఒకే రోజు 150 షాపుల సీజ్
* ఆక్రమణదార్లకు నోటీసులు
హైదరాబాద్, జూలై 13: మహానగరంలో రోడ్లు, జనాభాకు తగిన విధంగా ఫుట్‌పాత్‌లను సమకూర్చేందుకు జీహెచ్‌ఎంసీ చేపట్టిన చర్యల్లో భాగంగా ఫుట్‌పాత్‌లపై వెలిసిన ఆక్రమణలను తొలగిస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎంతో హడావుడి చేసి తొలగించిన ఆక్రమణలను చిన్నాచితక వ్యాపారులు, ఇతర సంస్థల యజమానులు తిరిగి నిర్మించటంతో నిన్నమొన్నటి వరకు మళ్లీ కూల్చివేసిన విజిలెన్స్ అధికారులు శుక్రవారం కఠిన చర్యలు చేపట్టారు. ఆక్రమణలను తొలగించిన చోట మళ్లీ నిర్మాణాలు జరిపినట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు హాంకాంగ్ బజార్‌లో ఒకే రోజు 150 షాపులను సీజ్ చేశారు. మళ్లీ తిరిగి నిర్మిస్తే మరింత కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి హెచ్చరించారు. హాంకాంగ్ బజార్‌తో పాటు ప్రముఖ వ్యాపార సంస్థలైన ఆదీశ్వర్ ఎలక్ట్రానిక్స్, బరిష్టా కాఫీ హౌజ్, ఫర్నిచర్ షాపు, స్వాగత్ హోటల్, జ్యుయలరీ షాపులు సీజ్ చేసిన వాటిలో ఉన్నాయి. రెండురోజులుగా నోటీసులు జారీచేస్తూ, జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానాలు వసూలు చేస్తున్నా, వ్యాపారుల్లో మార్పు రాకుండా, తిరిగి నిర్మించుకుంటున్నట్లు గుర్తించిన విజిలెన్స్ వారిపై ఈసారి ‘సీజ్’ అస్త్రాన్ని ప్రయోగించింది. తొలగించిన ఆక్రమణల స్థానంలో తిరిగి నిర్మించినందుకు ఇప్పటి వరకు వివిధ వ్యాపార సంస్థలు, వ్యక్తుల నుంచి సుమారు ఐదు లక్షల రూపాయలను జరిమానాలు వసూలు చేశామని విశ్వజిత్ కంపాటి వెల్లడించారు. ఆక్రమణలను తొలగించే ప్రక్రియ, తిరిగి నిర్మిస్తే సీజ్ చేసే చర్యలు నిరంతరం కొనసాగుతాయని, తాము చేపట్టిన చర్యల కారణంగా పలు ప్రాంతాల్లో కొన్ని వ్యాపార సంస్థలు తమ మార్గంలో ఫుట్‌పాత్‌లు నిర్మించేందుకు ముందుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు.