రంగారెడ్డి

నమ్మిన ఇంటికే కన్నం వేసిన వ్యక్తి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూలై 25: నమ్మిన ఇంట్లోనే కన్నం వేసిన ఓ వ్యక్తిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ బాలకృష్ణా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బాచుపల్లి గ్రామం కాసాని కౌసల్య కాలనీలో మురళీకృష్ణ నివాసముంటున్నాడు. మురళీకృష్ణ అన్న కూతురు అర్చన కా బోయే భర్త సుధాకర్‌తో కలిసి సొంత పనిపై గత నెలలో మురళీకృష్ణ ఇంటికి వచ్చారు. కొద్దిరోజుల పాటు అర్చన, సుధాకర్ ఉండగా వారి అవసర నిమి త్తం మురళీకృష్ణ ఇంటి తాళం చెవిని ఇవ్వగా సుధాకర్ తిరిగి ఇవ్వలేదు. మురళీకృష్ణ ఈనెల 14న 14 తులాల బంగారం కనిపించడం లేదని, లాక్ బ్రేక్ కాలేదని బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులో అర్చన, సుధాకర్‌పై అనుమానం ఉందని పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. అర్చన, సుధాకర్ సెల్‌ఫోన్ డేటాను పరిశీలించి, కౌసల్య కాలనీలోని సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఈనెల 3న సుధాకర్ వాడే కారు కౌసల్య కాలనీలో కనిపించినట్లు తెలుసుకున్నారు. సుధాక ర్ సెల్‌ఫోన్ లొకేషన్ హైదరాబాద్‌లో ఉండడం గమనించి వారిని విచారించేందుకు ఎస్సై శేఖర్ బృందం.. సుధాకర్ స్వగ్రామమైన వైజాగ్ వెళ్లా రు. సుధాకర్‌ను పోలీసులు విచారించ గా నేరాన్ని అంగీకరించాడు. మురళీకృష్ణ ఇంట్లో కొన్ని రోజులు ఉన్న సమయంలో ఇంటి కీని తిరిగి ఇవ్వకుండా తనవద్దే పెట్టుకుని దొంగతనం చేసినట్లు సుధాకర్ ఒప్పుకున్నాడు. మురళీకృష్ణ దంపతులిద్దరు ఉద్యోగస్థులు కావడంతో పగటి పూట ఇంట్లో లేని సమయం చూసి సుధాకర్ చోరీ చేశా డు. నిందితుడు సుధాకర్‌ని అరెస్ట్ చేసి వైజాగ్, కేపీహెచ్‌బీలోని మణపురం గోల్డ్ లోన్ బ్రాంచ్‌లో తాకట్టు పెట్టిన 14తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు.

నియోజకవర్గం అభివృద్ధికి శాయశక్తుల కృషి
కేపీహెచ్‌బీకాలనీ, జూలై 25 : శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్థికి తన వంతు శాయ శక్తుల కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బుధవారం ఆల్వీన్‌కాలనీ డివిజన్ జయనగర్ నుంచి ఉషామూళ్లనపూడి రోడ్డు వరకు రూ.1.50 లక్షలతొ చేపట్టనున్న వీడీ సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ పాల్గొని ప్రారంభించారు.
ప్రజలకు రవాణ వ్యవస్థను మెరుగుపరిచి బంగారు తెలంగాణ దిశగా బాటలు వేస్తామన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు వౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలన్నారు. కార్యక్రమంలో డీఈ కృష్ణ, ఏఈ సుభాష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ మహదేవ్, నాయకులు కాశీనాథ్ యాదవ్, శివరాజ్‌గౌడ్, సల్లా వుద్దీన్, రాజు, లక్ష్మీ పాల్గొన్నారు.

రాజకీయంగా దెబ్బ తీసేందుకే ఆరోపణలు
చేవెళ్ల, జూలై 25: చేవెళ్ల గ్రామ అభివృద్ధికి సర్పంచ్‌గా కృషి చేస్తుంటే రాజకీయంగా దెబ్బ తీసేందుకే కొందరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ నాగమ్మ తెలిపారు. బుధవారం పంచాయతీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిధులు దుర్వినియోగం చేసినట్లు నిరూపిస్తే ఆ డబ్బులు కట్టేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఒకవేళ నిరూపించకపోతే నేను కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. పంచాయతీ పరిధిలో చేసిన ప్రతి పనికి రికార్డులున్నాయని అన్నారు. డీపీవో కార్యాలయం నుంచి వచ్చిన నోటీసులకు అధికారులకు రికార్డులను చూపింపడంతో పాటు ఎంబీలు కూడా ఉన్నాయని వివరించారు. దీనికి సంబంధించి విచారణకు కూడా సహకరిస్తానని అన్నారు.