రంగారెడ్డి

భగీరథతో తీరిన తాగునీటి కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, జూలై 18: దేశంలో ఎక్కడా లేనివిధంగా మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలో శాశ్వతంగా తాగునీటి కష్టాలు తీరాయని డిప్యుటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలోని ప్రెస్టేజ్ కాలనీలో బుధవారం తాగునీటి సంపు నిర్మాణ పనులకు ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, రసమయి బాలకిషన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. సర్పంచ్ బేరీ ఈశ్వర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మా రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయంలో తాగునీటికి మహిళలు అరిగోస పడ్డారని, మహిళల ఇబ్బందులను గుర్తించి రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ కూడా తాగునీటికి ఇబ్బందులు పడకూడదని ఇంటింటికీ తాగునీరు అందించే విధంగా మిషన్ భగీరథ పథకాన్ని రూపొందించారని వివరించారు. గోదావరి, మంజీరా, సింగూరు తదితర నదులను అనుసంధానం చేసి మిషన్ భగీరథ పథకంతో తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 18 నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగు నీరందించాలని, లేనియేడల ఓట్లు అడుగమని ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. డిసెంబర్ 18 నాటికి తప్పకుండా ఇంటింటికీ తాగునీరు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్‌ఎండీఏ పరిధిలో అన్ని కాలనీలకు తాగునీరు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు. కాలనీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మీ, జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, జిల్లా ఆర్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త నందారెడ్డి, ఉప సర్పంచ్ దేవేందర్, ఎంపీటీసీ అమరం మోహన్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ సత్యనారాయణ, నాయకులు విష్ణుచారి, కృష్ణా రెడ్డి, శేఖర్ గౌడ్, రవీందర్ రెడ్డి, వీర్లపల్లి భాగ్యరెడ్డి, నర్సింహా రెడ్డి, శైలేందర్, కౌడే మహేశ్, మోనార్క్, వార్డు సభ్యులు అమరం విజయలక్ష్మీ, యాదగిరి పాల్గొన్నారు. కాలనీ ముందు జాతీయ రహదారి నుంచి మేడ్చల్ వరకు సర్వీసు రోడ్డు ఏర్పాటు చేసే విధంగా జాతీయ రహదారుల సంస్థ అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని, కాలనీ ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టేందుకు నిధులు కేటాయించాలని కోరుకున్నట్లు వివరించారు.

షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు
ఆమనగల్లు, జూలై 18: ఆమనగల్లు పట్టణ ప్రజల చిరకాల వాంఛ అయినటు వంటి షాపింగ్ కాంప్లేక్స్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని ఈ మేరకు రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రట్రి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారని ఆమనగల్లు జడ్పీటీసీ కండె హరిప్రసాద్ తెలిపారు బుధవారం ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లలితమ్మ, ఎంపీటీసీలు పత్యానయక్, ఝాన్సీ శేఖర్, జీ.శ్రీనివాసు, సోని జయరాం కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలొ మాట్లాడుతూ మండల పరిషత్ ఆవరణలో ఉన్నా ఖాళీ స్థలంలో 128 పాత ఆసుపత్రి ఖాళీ స్థలం 38 జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల బస్టాండ్ 58 మొత్తం 222 దుకాణ సమూదాయాలను నిర్మించెందుకు గుడ్‌విల్ ఫండ్ కింద అనుమతి లభించిదన్నారు. 2016 జనవరి 21న షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి, కేంద్ర మంత్రి బండారు దత్త త్రేయ, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారని అన్నారు హైదరబాద్-శ్రీశైలం జాతియ రహదారి నిర్మాణంలో భాగంగా రోడ్డుకు ఇరువైపుల తాత్కలికంగా చిరువ్యాపారులు డబ్బాలను వేసుకొని జీవింజేవారని, అట్టి డబ్బాలను తొలగించడంతో ఎంతోమంది ఊపాధికోల్పొయి రొడ్డున పడ్డారని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రభుత్వం అనుమతి మం జూరు చేయడంతో వారందరు షం తోషంగా ఉన్నారని అన్నారు. దీంతో 1000మందికి ఊపాధి కలుగుతుందని అన్నారు. మాజీ సింగల్ విండో చైర్మన్ టీ.వెంకటయ్య, బీజేపీ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బైకని శ్రీశైలం యాదవ్, గోరటి నర్సింహా నాయకులు లక్ష్యణ్, దుర్గయ్య, చెన్నకేశవులు, యాదగిరి, కృష్ణయ్య, యాదగిరి, రాజు, నర్సింహా, శ్రీ రాములు పాల్గొన్నారు.