రంగారెడ్డి

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సర్వాయి పాపన్నగౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్, ఆగస్టు 18: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్‌ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని గౌడ సంఘం నాయకులు అన్నారు. శనివారం ఫరూఖ్‌నగర్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట పాపన్న గౌడ్ 368వ జయంతిని పురస్కరించుకొని నూతనంగా ఏర్పాటు చేసిన సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని గౌడ సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సామాన్య ప్రజల బాగోగులు కోరుకున్న మహావ్యక్తి సర్ధార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు. పాపన్న గౌడ్ లాంటి మహానీయుల ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మొగల్ చక్రవర్తుల పై తిరుగుబాటు చేసిన పాపన్న గౌడ్‌ను నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అన్ని కులవృత్తులను ఏకం చేయడంతోపాటు ఐక్యత కోసం పాపన్న గౌడ్ ఎంతో శ్రమించారని పేర్కొన్నారు. పాపన్నగౌడ్ జీవిత చరిత్ర భావి తరాలవారికి తెలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో పాఠ్యంశంగా చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొత్తూరు ఎంపీపీ శివశంకర్ గౌడ్, మాజీ ఎంపీపీలు రంగయ్య గౌడ్, వన్నాడ ప్రకాష్ గౌడ్, బస్వరాజ్ గౌడ్, గౌడ సంఘం నాయకులు మద్దూరి అశోక్ గౌడ్, వీరాంజనేయులు గౌడ్, శ్రీకాంత్ గౌడ్, రామేశ్వర్‌గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, రాములు గౌడ్, గోవర్ధన్ గౌడ్, రాజేందర్ గౌడ్, శ్రీశైలం గౌడ్, అశోక్‌గౌడ్, భానుచందర్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, దేపల్లి అశోక్ గౌడ్, సుదర్శన్ గౌడ్, రాఘవేందర్ గౌడ్, ఆశన్న గౌడ్, కట్టా వెంకటేష్ గౌడ్, మహేష్, రజినికాంత్ గౌడ్, గణేష్, శివలింగం, మల్లేష్ పాల్గొన్నారు.
ఆమనగల్లు: ఆమనగల్లు కడ్తాల మండల కేంద్రల్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గౌడ కులస్థులు ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకలకు ముఖ్యఅథితిగా కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి జడ్పీటీసీ కండె హరిప్రసాద్ హజరయ్యరు కడ్తాల మిల్క్ చిల్లింగ్ సెంటర్ ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో పీసీసీ అద్యక్షులు అయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం నాయకులు అల్లాజి గౌడ్, తిరుపతయ్య గౌడ్, నిరంజన్ గౌడ్, రవి గౌడ్, యాదయ్య గౌడ్, బాలు, శ్రీశైలం, వేంకటేశ్,కుమార్,మల్లేశ్ గౌడ్,వేణుగోపాల్,యాదయ్య గౌడ్, పాల్గొన్నారు.
షాబాద్: సర్వాయి పాపన్న గౌడ్ సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం షాబాద్, మండల కేంద్రంలోని గౌడ సంఘం కార్యాయలంలో సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి నిరంతరం వెంట ఉండి వారికి న్యాయం కల్పించేవాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నక్క శ్రీనివాస్ గౌడ్, గౌడ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు గడిగె గజేందర్ గౌడ్, నర్సింలు గౌడ్, రాములుగౌడ్, గణేష్‌గౌడ్, అశోక్‌గౌడ్, వెంకటయ్య గౌడ్, రఘునందర్ గౌడ్, రాజేందర్‌గౌడ్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: తొలి తెలుగు విప్లవ కారుడు, దళిత బహుజన స్వరాజ్య వ్యవస్థాపకులు సర్ధార్ సార్వాయి పాపన్నగౌడ్ ఆశయసాధనకు కృషి చేయాలని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త అశోక్‌గౌడ్, తెరాస రాష్ట్ర నాయకులు ఈ చంద్రశేఖర్‌గౌడ్, తెదేపా నాయకులు తాళ్ళ మహేశ్‌గౌడ్‌లు అన్నారు. శనివారం పాపన్నగౌడ్ శతజయంత్యుత్సవాలలో భాగంగా చెరువుకట్టపైనున్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాపన్నగౌడ్ చేసిన కృషి శ్లాఘనీయమన్నారు. నిజాం చక్రవర్తులనే గడగడలాడించిన ఆయన పోరాట స్పూర్తి చారిత్రాత్మకమని చెప్పారు. ఆయన్ను స్పూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకెళ్ళాలని సూచించారు. కార్యక్రమంలో పండాల నిరంజన్‌గౌడ్, పాశం రవీందర్‌గౌడ్, తాళ్ళ శ్రీశైలంలు పాల్గొన్నారు.