రంగారెడ్డి

కేరళ వరద బాధితులకు బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్‌నగర్ రూరల్, ఆగస్టు 20: కేరళ బాధితులకు బిస్కెట్లు, మెడికల్ కిట్లు, దుప్పట్లు పంపించారు. సోమవారం షాద్‌నగర్‌లో ఎన్‌ఎస్‌యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు అందె శ్రీకాంత్ సొంత డబ్బు రూ.20వేల రూపాయలతో బిస్కెట్లు, మెడికల్ కిట్లు, దుప్పట్లను హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి తరలించారు. శ్రీకాంత్ మాట్లాడుతూ కేరళలో నిరంతరం కురుస్తున్న వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ మంచి మనస్సుతో కేరళ ప్రజలను అదుకునేందుకు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ అగ్గనూరి విశ్వం, కట్టా వెంకటేష్ గౌడ్, బాబర్‌ఖాన్, జితేందర్, సుధాకర్, బాబునాయక్, రాఘవేందర్ గౌడ్, ముబారక్ అలీఖాన్, ఖదీర్, అందె మోహన్, ప్రదీప్, రాజేష్‌కుమార్, వంశీ, నందు, ఫయాజ్, ప్రవీన్ పాల్గొన్నారు.
కొందుర్గు: కొందుర్గు మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కేరళ వరద బాధితుల సహాయర్థం నిధులను సేకరించే పనిలో సీపీఐ నేతలు నిమగ్నమయ్యారు. సీపీఐ జిల్లా సమితి సభ్యుడు ఇ.నర్సింలు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా కేరళ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, వర్షాలకు 400మందికిపైగా ప్రజలు మృత్యువాత పడ్డారని వివరించారు. సర్వం కోల్పోయిన కేరళ బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
వనస్థలిపురం: కేరళ వరద బాధితులకు ప్రతి ఒక్కరు తమవంతు సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకోవాలని రంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి కోరారు.
సేవా భారతి ఆధ్వర్యంలో సోమవారం బీఎన్‌రెడ్డినగర్ నుండి గణేష్ టెంపుల్ వరకు కేరళ వరద భాధితుల కోసం విరాళాలను సేకరించారు. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సేకరించిన విరాళాలను ఆర్‌ఎస్‌ఎస్ ద్వారా కేరళకి పంపించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరు తమకు తోచిన సహాయాన్ని అందించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు.
బాధితులకు ఎమ్మెల్యే వివేక్ గౌడ్ సాయం
జీడిమెట్ల : కేరళలో భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అయిన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేక్ తన నెల జీతాన్ని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. వివేక్ మాట్లాడుతూ వరద బాధితులను మానవతా ధృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు కేరళ వరద బాదితులకు సహాయం అందించాలని సూచించారు.
సహాయార్థం ముందుకురావాలి :కలెక్టర్ ఉమర్ జలీల్
వికారాబాద్: కేరళ రాష్ట్ర తుఫాను బాధితుల సహాయార్థం విరివిగా విరాళాలు అందించేందుకు అధికారులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ మానవతా ధ్రుక్పథంతో కేరళ తుఫాను బాధితుల కోసం అధికారులందరూ విరాళాలు అందించాలని సూచించారు. ముఖ్యంగా ఎక్సైజ్, మైన్స్ ఏడీ, పరిశ్రమల శాఖ, ఇంజనీరింగ్ శాఖలు వారి ఆధీనంలో గల సంబంధీకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు రూపంలోనే కాకుండా వంట వస్తువులైన బియ్యం, పప్పులు, వంట నూనెలు, బిస్కెట్లు, దుస్తులు, దుప్పట్లు, బెడ్‌షీట్లు. టూత్ పేస్టులు, సబ్బులు, బకెట్లు, మగ్గులు, మందులు తదితర వస్తువులను అందజేయవచ్చని చెప్పారు. వస్తువులను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కేరళాకు రవాణ చేస్తారని పేర్కొన్నారు. విరాళాలు నేరుగా అందజేసే వారు ఖాతా నెంబర్ 67319948232 ఎస్‌బీఐకి, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్ 0070028 తిరువనంతపురం శాఖ సీఎండీఆర్‌ఎఫ్‌కు పంపించవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సహాయ నిధి సేకరించిన పౌర సమాజం
కేరళ వరద బాధితుల కోసం వికారాబాద్ పౌర సమాజం సోమవారం సహాయ నిధి కోసం విరాళాలను సేకరించింది. జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి వద్ద థియేటర్ నుంచి ఎన్టీయార్ కూడలి వరకు విరాళాను సేకరించారు.
తహశీల్దార్ సమక్షంలో సేకరించిన డబ్బును లెక్కించగా రూ.56,257 వచ్చింది. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్, సీనియర్ న్యాయవాది పీ.గోవర్ధన్ రెడ్డి, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ కే.రంగరాజు, టీజేఎస్ నాయకులు గడ్డం రాంచందర్, మాణిక్ రెడ్డి, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకుడు సింగారపు రామకృష్ణ, మాజీ కౌన్సిలర్లు లక్ష్మణ్ రావు, బుచ్చిబాబు గౌడ్, జిల్లా వాల్టా సభ్యుడు మంచన్‌పల్లి సురేష్‌కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు రవిశంకర్, ఖాలేద్, దళిత సంఘాల ఐక్యవేదిక నాయకుడు సీ.జగదీశ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గాంధీ 5 లక్షలు,క ర్పొరేటర్ ఒక నెల వేతనం విరాళం
శేరిలింగంపల్లి: కేరళలో సంభవించిన విపత్తుపై స్పందించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ రూ.5లక్షల విరాళం ప్రకటించారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో తనవంతుగా విరాళం ఇవ్వడానికి నిర్ణయించానని, శేరిలింగపల్లి నియోజకవర్గం పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తమవంతుగా తోచిన సాయం చేయాలని ఎమ్మెల్యే గాంధీ పిలుపునిచ్చారు. ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ప్రకటించారు. కేరళ ముఖ్యమంత్రి పునరావాస సహాయ నిధి ( సీఎండీఆర్‌ఎఫ్ ) ఖాతాకు ఆ మొత్తాన్ని పంపించనున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.