రంగారెడ్డి

యువతులు ఆకర్షణలకు లోను కావద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఆగస్టు 20: తమను తాము రక్షించుకునేందుకు మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. మండల పరిధి పోచారం ఇన్ఫోసిస్ కంపెనీ ఆవరణలో షీ టీమ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, డిగ్రీ, ఇంటర్ విద్యార్ధినిలకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 300 పైగా విద్యార్ధినిలు పాల్గొన్నారు. యువతులు ఆకర్షణలకు లోను కాకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఫేస్ బుక్, వాట్సాప్, మెసెంజర్లలో వచ్చే ఆకర్షణీయమైన మెసేజ్‌లకు ఆకర్షితులై స్నేహం చేయటం మొదలు పెట్టి మోసపోవద్దని చెప్పారు.
ఎవరికైనా పురుషుల నుండి వేధింపులు, ఇబ్బందులు ఉంటే వెంటనే షీ టీమ్‌లకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. మహిళలు స్వయం రక్షణకు తీసుకోవవలసిన జాగ్రత్తలు, ఎదుర్కోవలసిన మెళకువలు షీ ఫర్ హర్ కార్యక్రమంలో నేర్పిస్తామని చెప్పారు. ఎక్కడ సమస్య నెలకొన్న వెంటనే 100 నెంబర్‌కు డయల్ చేయాలని, చేసిన వెంటనే షీ టీమ్ సభ్యులు అక్కడికి చేరుకుని రక్షిస్తారని చెప్పారు. మహిళలపై లైంగిక వేధింపులు ఉన్నప్పటికీ పరువు పోతుందనే భయంతో పోలీసులకు సమాచారం ఇవ్వటం లేదని చెప్పారు.
మహిళలకు సంబంధించిన వివరాలు బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. షీ టీమ్‌లో నేటీ వరకు ఎనిమిది వందలకు పైగా విద్యార్ధినిలు, యువతులు వాలంటీర్లుగా చేరారని చెప్పారు. ఎక్కువ సంఖ్యలో వాలంటీర్లుగా చేరి మహిళలకు రక్షణగా నిలవాలని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకై దరఖాస్తులు కోరుతున్నట్లు చెప్పారు. మహిళలకు రిజర్వేషన్లు ఉన్నందున ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకుని పోలీసు ఉద్యోగంలో చేరి మహిళలకు రక్షణగా నిలవాలని సూచించారు. వాలంటీర్లుగా చేరినవారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో షీ టీమ్ డీజీపీ సలీమా, ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి, విద్యార్ధినీలు పాల్గొన్నారు.

పట్టించుకోండి.. లారీలను పట్టుకోండి
* అధికారి కాళ్లు మొక్కిన కార్పొరేటర్ సామ
హయత్‌నగర్, ఆగస్టు 20: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించాలన్న చందంగా తెలంగాణ ప్రభుత్వ అధికారుల పనితీరు అలా ఉంది. ప్రభుత్వం పథకాలను, నిబంధనలను ప్రవేశపెడుతున్నా అధికారులు వాటిని అమలు చేయడం లేదనడానికి హయత్‌నగర్‌లో జరిగిన సంఘటన నిదర్శంగా నిలిచింది. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్ సమస్యను పరిష్కరించాలని అధికారి కాళ్లు పట్టుకున్నాడు. సోమవారం పెద్దఅంబర్‌పేట్‌లో డస్ట్, కంకర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధిక లోడ్‌తో వెళ్లే కంకర, డస్ట్ లారీల కారణంగా రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయని తెలిపారు. సమావేశానికి హాజరైన హయత్‌నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి అధిక లోడ్‌తో వెళ్తున్న 50 లారీలను పట్టుకున్నారు. అధిక లోడ్‌తో బీఎన్‌ఆర్ కంపెనీ లారీలు వెళ్తున్నా ఆర్‌టీఓ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అదేసమయంలో అటుగా వెళ్తున్న ఇబ్రహీంపట్నం ఎంవీఐ చూసిచూడనట్లు వెళ్తున్నారు. కార్పొరేటర్ తిరుమల్‌రెడ్డి ఎంవీఐ అధికారి వాహనాన్ని ఆపి అధిక లోడ్‌తో వెళ్లే వాహనాలను అరికట్టాలని ప్రాధేయపడుతూ అధికారి పాదాలకు మొక్కారు. బీఎన్‌ఆర్ కంపెనీకి అధికారులు వంతపాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.