బిజినెస్

ఆర్థిక వ్యవస్థలో స్వల్ప పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది పనితీరుపై రంగరాజన్ అంచనా

కోయంబత్తూర్, నవంబర్ 21: భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు ఈ ఏడాది కొద్దిగా మెరుగ్గా ఉండొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ సి రంగరాజన్ అన్నారు. అయితే దేశ జిడిపి వృద్ధిరేటు 7.5 శాతం దరిదాపుల్లోనే ఉంటుందని అంచనా వేశారు. శనివారం ఇక్కడ కుమారగురు టెక్నాలజీ కళాశాలలో ఇండియా ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ 24 సెషన్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లో వ్యవసాయ రంగ వృద్ధిరేటు తక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇకపోతే వివిధ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కున్న నిబంధనలపై స్పందిస్తూ కొన్ని రంగాల్లో 100 శాతం ఎఫ్‌డిఐకి అనుమతివ్వడం, మరికొన్ని రంగాల్లో ఎఫ్‌డిఐని పరిమితం చేయడం జరుగుతోందన్నారు. ముఖ్యంగా రక్షణ రంగంలో ఈ తారతమ్యం ఉందన్న ఆయన విదేశీ పెట్టుబడులను కేవలం దేశ ఆర్థిక పరిపుష్ఠికే కాకుండా, నూతన సాంకేతికాభివృద్ధికి వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 15 రంగాల్లో ఎఫ్‌డిఐ నిబంధనలను సరళతరం చేసిన విషయం తెలిసిందే. మరికొన్ని రంగాల్లోనూ ఎఫ్‌డిఐకి విస్తృత అవకాశాలు కల్పిస్తామని మోదీ సర్కారు స్పష్టం చేస్తోంది కూడా. ఈ క్రమంలో విదేశీ మారక ద్రవ్య వినియోగం అర్థవంతంగా ఉండాలని గత ప్రభుత్వ హయాంలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు మండలి (పిఎమ్‌ఇఎసి) చైర్మన్ కూడా అయిన రంగరాజన్ అభిప్రాయపడ్డారు.