ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో విస్తారంగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : మూడు రోజులుగా కోస్తా జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. సాలూరులో గంటపాటు భారీవర్షం పడింది. విశాఖపట్నంలోని కోట ఉరట్లలో అత్యధికంగా 13 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదుకాగా, పూసపాటిరేగ, భోగాపురంలో 4 నుంచి 6 సెంటీమీటర్లు వర్షం కురిసింది. తునిలో 11 సెం.మీ., కొయ్యలగూడెంలో 9, పోలవరం, తెర్లాంలలో 7, పాలేరు, పగిడ్యాల, శ్రీశైలంలలో 6, ప్రత్తిపాడు, ఆత్మకూరులలో 5, నందిగామ, మార్కాపురంలలో 4 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదయింది. కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. విజయవాడలో భారీ వర్షం పడింది. రెడ్డిగూడెంలో అత్యధికంగా 75.8 మిల్లీమీటర్లు కురిసింది.