జాతీయ వార్తలు

గ్యాంగ్‌రేప్‌లో ముగ్గురు నిందితులకు మరణశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హతమార్చిన కేసులో ముగ్గురు నిందితులకు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులకు యావజ్జీవశిక్ష విధించింది. పశ్ఛిమబంగ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసులో తీర్పుపై సానుకూల స్పందన వచ్చింది. కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలోని కందుని గ్రామానికి చెందిన 21 ఏళ్లయువతి కళాశాలనుండి ఇంటికి వెళుతూండగా నిర్బంధించి కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన దుండగులు ఆ తరువాత ఆమెను హత్య చేశారు. ఒక కెనాల్‌లో ఆమె మృతదేహాన్ని గుర్తుపట్టిన ఆమె సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. 2013 జూన్‌లో ఈ దుర్ఘటన జరిగింది. దీనిపై అప్పుడు రాష్ట్రంలో ఆందోళనలు రేగాయి. కాగా ఇప్పుడు ఆ కేసులో కోర్టు తీర్పు ప్రకటించింది. ప్రధాన నిందితులు అన్సార్ అలీ, సైఫర్ అలి, అమిన్ అలీలకు మరణశిక్ష విధించింది. కాగా తీర్పు సమయంలో మృతురాలి సోదరుడు భద్రతరీత్యా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా ఆ తరువాత కొద్దిసేపు కోర్టువద్ద ఉద్రిక్తత నెలకొంది.