జాతీయ వార్తలు

బాలికపై కామంధుల అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన సంఘటన ఇది. చెన్నైలోని పురుసవాక్కుమ్‌లో 300 ఫ్లాట్స్ ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఈ ఘోరం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఈ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే ఓ బాలికకు చెవుడు ఉంది. ఎలివేటర్‌గా పనిచేసే 66 ఏళ్ల రవికుమార్ అనే వ్యక్తి ఈ బాలికను లోబరుచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. తరువాత మరో ఇద్దరు తాగుబోతులు ఈ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీన్ని వీడియో తీసి ఆ బాలికను బెదిరించి దాదాపు 22 మంది అత్యాచారం చేశారు. వీరిలో ఎక్కువమంది సెక్యూరిటీ గార్లులే అధికంగా ఉండటం గమనార్హం. మత్తు ఇంజెక్షన్లు, డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసేవారు. ఏడు నెలలు పాటు జరిగిన ఈ ఘోరాన్ని ఈ బాలిక తన ఇంటికి చుట్టంగా వచ్చిన తన వయసు అమ్మాయితో చెప్పి భోరుమంది. ఈ విషయాన్ని ఆ అమ్మాయి తల్లికి చెప్పటంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. బాలికను పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 22 మంది మృగాల్లో 18మందిని అరెస్టు చేశారు.